
హైదరాబాద్: సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ కు ‘సర్కారు వారి పాట’ మూవీ యూనిట్ సర్ ప్రైజ్ ఇచ్చింది. ఈ సినిమా నుంచి తాజాగా ‘ఎవ్రీ పెన్నీ’ అనే పాట ప్రోమోను సినిమా టీమ్ రిలీజ్ చేసింది. ఈ సాంగ్ వీడియోలో మహేశ్ కుమార్తె సితార నటించడం విశేషం. పెన్నీ పాట ప్రోమోలో సితార వేసిన స్టెప్స్ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ఫుల్ సాంగ్ ను మార్చి 20న విడుదల చేయనున్నారు. మహేశ్, సితార ఒకేపాటలో కనిపించడం ఆయన ఫ్యాన్స్ కు డబుల్ ఫీస్ట్ అనే చెప్పాలి.
ఇకపోతే, సర్కారు వారి పాటకు సంబంధించే ఇప్పటికే విడుదల చేసిన ‘కళావతి’ సాంగ్ ఎంత పెద్ద హిట్ గా నిలిచిందో తెలిసిందే. వరుసగా సూపర్ హిట్ ట్రాక్స్ తో సంగీత ప్రియుల మనసులు దోచుకుంటున్న తమన్.. ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు. పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. మే 12న ఈ సినిమా రిలీజ్ కానుంది.
మరిన్ని వార్తల కోసం: