ఉక్రెయిన్ తీరుపై పుతిన్ ఫైర్

ఉక్రెయిన్ తీరుపై పుతిన్ ఫైర్

మాస్కో: ఉక్రెయిన్ తీరుపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. చర్చల విషయంలో ఉక్రెయిన్ తీరు సరిగా లేదని మండిపడ్డారు. చర్చలను జెలెన్స్కీ అడ్డుకుంటున్నారని విమర్శించారు. తమ అధికారులు చర్చల విషయంలో ఉత్సాహంగా ఉన్నారని.. కానీ ఉక్రెయిన్ వైపు నుంచి మాత్రం ఎటువంటి స్పందన లేదన్నారు. సమస్యకు పరిష్కారం చూపించేందుకు తాము రెడీగా ఉన్నామని స్పష్టం చేశారు. సెక్యూరిటీ కౌన్సిల్ తో భేటీ అయిన ఆయన.. ఉక్రెయిన్ ఆపరేషన్ పై చర్చించారు. మరోవైపు రష్యాకు చైనా సహకరిస్తోందన్న వార్తల నేపథ్యంలో.. జిన్ పింగ్ తో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఫోన్ లో మాట్లాడారు. ఉక్రెయిన్ పై దాడులు ఆపేలా పుతిన్ మీద ఒత్తిడి తీసుకురావాలని జిన్ పింగ్ ను ఆయన కోరారు. 

మరిన్ని వార్తల కోసం:

జూబ్లీహిల్స్ కారు ప్రమాదం కేసులో ట్విస్ట్

నిరుద్యోగులకు గుడ్ న్యూస్

‘జూనియర్‌‌‌‌’కు జంటగా శ్రీలీల