భగ్గుమంటున్న భానుడు

భగ్గుమంటున్న భానుడు

హైదరాబాద్: తెలంగాణలో ఈ మూడ్రోజుల పాటు పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇవాళ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. సగటు సముద్ర మట్టానికి సుమారు 0.9 కిలో మీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్న ఉపరితల ద్రోణి శుక్రవారం బలహీనపడినట్లు తెలిపింది. తూర్పు విదర్భ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 0.9 కి.మీ.ల ఎత్తు వరకు విస్తరించి ఉందని పేర్కొంది. ఆదిలాబాద్, కుమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని వెల్లడించింది. 

మరిన్ని వార్తల కోసం:

మంచు గుప్పిట్లో కశ్మీరం

ఉక్రెయిన్ తీరుపై పుతిన్ ఫైర్

జూబ్లీహిల్స్ కారు ప్రమాదం కేసులో ట్విస్ట్