ఎల్బీనగర్ లో స్వచ్ఛభారత్.. చీపురు పట్టి రోడ్డు ఊడ్చిన బీజేపీ అధ్యక్షుడు

ఎల్బీనగర్ లో స్వచ్ఛభారత్.. చీపురు పట్టి రోడ్డు ఊడ్చిన బీజేపీ అధ్యక్షుడు

స్వచ్ఛభారత్ మహోన్నతమైన కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రధాని మోదీ చేపట్టిన కార్యక్రమంతో సమాజంలో ఎంతో మార్పు వచ్చిందని రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షుడు సామ రంగారెడ్డి అన్నారు. స్వచ్ఛభారత్ లో భాగంగా ఎల్బీనగర్ లో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు, మహిళ నాయకులతో కలిసి సామ రంగారెడ్డి చీపురు పట్టి రోడ్లు ఊడ్చారు.  

ప్రధాని మోదీ 2014లో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని తీసుకువస్తే ప్రతిపక్షాలు, ఇతర పార్టీలు అవహేళన చేశాయని.. కానీ ఇప్పుడు అవే పార్టీలు చీపురు పట్టుకుని రోడ్ల మీదకి వచ్చి స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొంటున్నారని సామ రంగారెడ్డి అన్నారు.

దీన్ని బట్టి చూస్తే మోదీ తీసుకువచ్చిన కార్యక్రమం సమాజంలో అందరికీ ఎంత గొప్ప స్ఫూర్తిని తెచ్చిపెట్టిందో అర్థమవుతుందని తెలిపారు. గాంధీ జయంతి సందర్భంగా ఇలాంటి మంచి కార్యక్రమం ప్రారంభించుకోవడం చాలా సంతోషకరమైన విషయమని సామ రంగారెడ్డి తెలిపారు.