‘స్వామిత్వ’ స్కీం ముంగట పడ్తలే

‘స్వామిత్వ’ స్కీం ముంగట పడ్తలే
  • గ్రామాల్లో ఇండ్ల అమ్మకాలు, కొనుగోళ్లకు తిప్పలు
  • అటకెక్కిన గ్రామ కంఠం స్థలాల రెగ్యులరైజేషన్
  • పైలట్ గ్రామాల ఎంపికతో సరిపెట్టిన సర్కార్​
  • పొరుగు రాష్ట్రాల్లో చకచకా డ్రోన్ సర్వే, ప్రాపర్టీ కార్డుల పంపిణీ

హైదరాబాద్, వెలుగు: గ్రామాల్లో గ్రామకంఠం భూములకు ప్రాపర్టీ కార్డులు మంజూరు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న సర్వే ఆఫ్ విలేజెస్ విత్ ఇంప్రూవ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజీ ఏరియాస్(స్వామిత్వ) యోజన స్కీం రాష్ట్రంలో ముందుకు సాగుతలేదు. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్, చత్తీస్ గఢ్, కర్నాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో ఈ స్కీం పైలట్ ప్రాజెక్ట్ దశను దాటి సగం మేర గ్రామాల్లో డ్రోన్ సర్వే, మ్యాపుల డిజిటలైజేషన్ పూర్తి కావొస్తుండగా.. మన రాష్ట్రంలో మాత్రం ఇంకా బాలరిష్టాలు దాటడం లేదు. గ్రామాల్లో ఇంటి నిర్మాణ పర్మిషన్లకు రిజిస్ట్రేషన్ పేపర్లు అడుగుతుండడంతో.. ఇంటి పన్ను రసీదులు తప్ప ఇతర హక్కుపత్రాలు లేని వారికి ఇబ్బందులు తప్పడం లేదు.

రాష్ట్రంలో స్వామిత్వ స్కీం పైలట్ విలేజీలుగా రంగారెడ్డి జిల్లా కందుకూరు మండ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లం స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రస్వతిగూడ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మేడ్చల్ జిల్లా కీస‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర మండ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లం గోధుమకుంట‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గామ జిల్లా స్టేష‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్ ఘ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్, ఆదిలాబాద్ జిల్లా త‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డుగు మండ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లం అర్లి గ్రామం, కామారెడ్డి జిల్లా దోమ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కొండ గ్రామాలను ఎంపిక చేశారు. స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్వే ఆఫ్ ఇండియా అధికారులు గ్రామ కంఠాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించి కొత్త మ్యాప్ ల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారు. రాష్ట్ర పంచాయతీ అధికారులు ఆ మ్యాపులను మరోసారి క్రాస్ చెక్ చేసుకుని ఓనర్లవారీగా ప్రాపర్టీ కార్డులను సిద్ధం చేయాల్సి ఉంది. కానీ, ఇప్పటి వరకు ఎక్కడా ప్రాపర్టీ కార్డులను ఇంకా సిద్ధం చేయలేదు.  

స్వామిత్వకు పోటీగా రాష్ట్ర సర్కార్ మరో పైలట్ ప్రోగ్రాం.. 

కేంద్ర ప్రభుత్వం స్వామిత్వ స్కీం అమలుకు అన్ని రాష్ట్రాలకు నిధులు మంజూరు చేస్తోంది. మన రాష్ట్రంలోనూ స్కీంను అమలు చేస్తే ఫండ్స్ వస్తాయి. గ్రామ కంఠం/ఆబాదీ స్థలాలకు రిజిస్ట్రేషన్ పత్రాల్లాంటి ప్రాపర్టీ కార్డులను అందజేసి బ్యాంక్ లోన్ వచ్చేలా చేయాలని కేంద్ర ప్రభుత్వం రెండేండ్ల క్రితమే ఈ స్కీంను తీసుకురాగా.. ఈ క్రెడిట్ కేంద్రం ఖాతాలో పడకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో రూపంలో ఈ స్కీంను అమలుచేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో మెద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్ జిల్లాలోని కొత్తప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లి, మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లంపేట‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్ జిల్లాలోని అన్నారెడ్డిప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లి, నంచెర్ల గ్రామ పంచాయ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తీలను గ్రామ కంఠం స్థలాల అధ్యయనానికి పైలట్ విలేజీలుగా సెలెక్ట్ చేసింది. స్వామిత్వ స్కీంలో ప్రాపర్టీ కార్డులు జారీ చేస్తే ప్రధాని ఫొటో పెట్టాల్సి ఉండడంతో స్కీంను మరో పేరుతో అమలు చేసి సీఎం కేసీఆర్ ఫొటోతో కూడిన పాస్ బుక్స్ అందజేయాలని భావిస్తున్నట్లు తెలిసింది.

‘ధరణి’ని మించి పక్కా హక్కుల రికార్డు

ఈ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌– పంచాయతీ పోర్టల్లో ఇప్పటికే ఇంటి నంబర్, యజమాని పేరు, ట్యాక్స్ కు సంబంధించిన డేటా అందుబాటులో ఉంది. కానీ, ఇంటి విస్తీర్ణానికి సంబంధించి కచ్చితమైన కొలతలు ఇందులో లేవు. కానీ, సమగ్ర హక్కుల రికార్డుగా స్వామిత్వ కార్డును కేంద్రం రూపొందిస్తున్నది. ముందుగా సర్వే ఆఫ్ ఇండియా సిబ్బంది డ్రోన్ తో ఫొటోలు తీసి, డేటాను ప్రాసెస్ చేసి లార్జ్ స్కేల్ మ్యాపింగ్ ద్వారా ఆస్తుల విస్తీర్ణం గుర్తించి రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తారు. తర్వాత ఇండ్ల హద్దులు గుర్తించి పూర్తిస్థాయిలో విచారణ జరిపి సర్వేతో లింక్ చేస్తారు. ఆ తర్వాత రికార్డును రూపొందించి స్వామిత్వ కార్డులను జారీ చేస్తారు. 

రిజిస్ట్రేషన్ పత్రాలు లేకుంటే ఇంటి పర్మిషన్ ఇవ్వరు 

పాత ఇళ్లకు పంచాయతీలు, మున్సిపాలిటీలు ఇచ్చిన ఓనర్ షిప్ సర్టిఫికెట్ల ఆధారంగా గ్రామ కంఠం భూములను గతంలో  రిజిస్ట్రేషన్ చేసుకునేవారు. 2021 ఫిబ్రవరి నుంచి ప్రభుత్వం ఆ సర్టిఫికెట్ల జారీని నిలిపివేసింది. దీంతో గ్రామకంఠంలో  ఉన్న ఇళ్లను కొత్తగా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే కుదరడం లేదు. దీంతో గ్రామాల్లో ఇళ్ల అమ్మకాలు, కొనుగోళ్లకు ఇబ్బందులు తప్పడం లేదు. రిజిస్ట్రేషన్ పత్రాలు లేకుంటే కొత్తగా ఇంటి పర్మిషన్ కూడా సెక్రటరీలు ఇవ్వడం లేదు.