హిందూ దేవాలయాలు ఎవరబ్బ సొత్తు కాదు

హిందూ దేవాలయాలు ఎవరబ్బ సొత్తు కాదు

యాదగిరిగుట్ట ఆలయం భవిష్యత్తులో అత్యద్భుత దివ్యక్షేత్రంగా పేరొందుతుందని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనారసింహ స్వామి వారిని దర్శించుకున్న ఆయన...ఉత్తరపీఠాధిపతి స్వాత్మానందేంద్రతో కలసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏకాదశి పర్వదినాన స్వామి వారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని స్వరూపానందేంద్ర చెప్పారు. రాజుల కాలంలో యాదాద్రిలాంటి నిర్మాణాలు చూశామని, మళ్లీ ఇప్పుడు సీఎం కేసీఆర్ వల్ల అది సాధ్యమైందని ప్రశంసించారు. రానున్న రోజుల్లో ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రాల్లో ఒకటిగా యాదగిరిగుట్ట ఆలయం విలసిల్లుతుందని స్వరూపానందేంద్ర అభిప్రాయపడ్డారు. 

యాదగిరిగుట్ట పునర్నిర్మాణం తర్వాత ఆలయాన్ని సందర్శించిన తొలి పీఠాధిపతి స్వరూపానందేంద్ర .. కేసీఆర్ను ప్రశంసలతో ముంచెత్తారు. హిందువులమని చెప్పుకునే నాయకులు ఎంత మంది ఉన్నా.. కేసీఆర్ చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తారమని అన్నారు. చిన్నజీయర్ గురించి   హిందూ దేవాలయాలు ఎవరబ్బ సొత్తూ కాదని, ఏ ఆలయాన్ని శైవానికి, వైష్ణవానికి పరిమితం చేయడం సరికాదని అన్నారు. ఆది శంకరులే జగద్గురువులన్న స్వరూపానందేంద్ర స్వామి.. వివాదాలు నడుస్తున్న సమయంలో ఆయన సకల దేవతలకు స్తోత్రాలు రాసిన విషయాన్ని గుర్తు చేశారు.