
విరాట్ కోహ్లి లాంటి స్టార్ బ్యాటర్ పట్ల యంగ్ క్రికెటర్ల వినయంగా ఉంటారు. కోహ్లీతో సరదాగా ఉండాలంటే ఆలోచిస్తారు. చాలా మంది యంగ్ క్రికెటర్లు.. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి కాస్త దూరంగానే ఉంటారు. క్రికెట్ లెజెండ్ గా ఎదిగిన కోహ్లి పట్ల గౌరవమే అందుకు కారణం. కానీ 20 ఏళ్ల ఈ ఆర్సీబీ కుర్రాడు స్వస్తిక్ చికారా లెక్కే వేరు. కోహ్లీకి ఈ యువ క్రికెటర్ డై హార్డ్ ఫ్యాన్ అనడంలో అతిశయోక్తి లేదు. ఐపీఎల్ 2025లో కోహ్లీపై చికారా చూపించిన అభిమానం చూస్తుంటే ముచ్చట గొలిపేలా ఉంటుంది. తాజాగా కోహ్లీపై తన అభిమానాన్ని చాటుకుంటూ చికారా కొన్ని ఎమోషనల్ కామెంట్స్ చేశాడు.
కోహ్లీ గురించి పొగుడుతూ ఆకాశానికెత్తేశాడు. " విరాట్ కోహ్లీ భయ్యా నాకు దేవుడి కంటే ఎందులోనూ తక్కువ కాదు. నాకు ప్రతిదీ అతనే స్ఫూర్తి. కోహ్లీ అంటే నాకు ప్రపంచం". అని స్వస్తిక్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2025 సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ గెలిచిన వెంటనే కోహ్లీ ఎమోషనల్ అయ్యాడు. ఈ మూమెంట్ లో కోహ్లీ దగ్గరకు మొదట వెళ్లిన వ్యక్తి స్వస్తిక్ చికారా. కోహ్లీ సెలెబ్రేషన్ చేసుకుంటున్న ప్రతి మూమెంట్ లో చికారా అతని పక్కనే ఉండి సపోర్ట్ చేస్తూ తన అభిమానాన్ని చాటుకుంటూ ఉంటాడు.
►ALSO READ | 2027 ODI World Cup: కోహ్లీ, రోహిత్ 2027 వన్డే వరల్డ్ కప్ ఆడలేరు.. కారణమిదే: హర్భజన్ హాట్ కామెంట్స్
యూపీటి20 లీగ్ ప్రారంభ సీజన్‌లో మీరట్ మావెరిక్స్ తరపున చికారా అద్భుతంగా రాణించాడు. ఈ టోర్నీలో 494 పరుగులు చేసి ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఇందులో మూడు సెంచరీలతో పాటు 26 సిక్స్‌లు ఉన్నాయి. ఆ తర్వాత సీజన్ లో చికారా 185 స్ట్రైక్ రేటుతో 47 సిక్స్‌లతో 499 పరుగులు చేసి అదరగొట్టాడు. చికారా ప్రదర్శనతో ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఆర్సీబీ ఈ యూపీ కుర్రాడిని రూ.30 లక్షలకు కొనుక్కుంది. దురదృష్టవశాత్తు ఈ సీజన్ లో చికారా ఒక్క మ్యాచ్ లో కూడా ప్లేయింగ్ 11 లో చోటు దక్కించుకోలేకపోయాడు.