
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా ఎన్నికైన మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ లు ప్రమాణ స్వీకారం చేశారు. శాసన మండలిలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వీరిచేత ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి శాసన సభా వ్యవహారాలా మంత్రి శ్రీధర్ బాబు, పలువురు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ నేతలు హాజరయ్యారు.
అయితే గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ఎన్నికల ప్రొ.కోదండరామ్, అమీర్ అలీ ఖాన్ ప్రమాణ స్వీకారం ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండగా.. మంగళవారం (జనవరి 30) న హైకోర్టు బ్రేక్ వేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు రెండు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి యథాతథ స్థితి కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది. గతేడాది నామినేషన్లను గవర్నర్ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ ఎస్ నేతలు దాసోజు శ్రవణ్ కుమార్, సత్యనారాయణ దాఖలు చేరసిన పిటిషన్ పై జస్టిస్ అలోక్ ఆరాధే జస్టిస్ ఎస్. నందలతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.