4 రైళ్ల స్టేషన్లలో స్విగ్గీ ఫుడ్ డెలివరీ 

4 రైళ్ల స్టేషన్లలో స్విగ్గీ ఫుడ్ డెలివరీ 

న్యూఢిల్లీ: ఫుడ్​ డెలివరీ స్టారప్ ​స్విగ్గీ ఈ నెల12 నుంచి బెంగళూరు, భువనేశ్వర్, విశాఖపట్నం  విజయవాడ రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు ఆహారం అందించనుంది.   ఫుడ్ డెలివరీ సేవలను రానున్న వారాల్లో మరో 59 రైల్వే స్టేషన్లకు విస్తరించనున్నట్లు స్విగ్గీ ఒక ప్రకటనలో తెలిపింది. రైళ్ల నుంచి ప్రీ-ఆర్డర్ చేసిన ఆహారాన్ని డెలివరీ చేయడానికి మంగళవారం స్విగ్గీ,  ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్​సీటీసీ) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.

ఐఆర్​సీటీసీ యాప్‌‌‌‌‌‌‌‌లో పీఎన్​ఆర్​ఎంటర్​ చేసి, ఫుడ్ డెలివరీ ఇవ్వాల్సిన స్టేషన్​ పేరును పేర్కొనాలి. అక్కడికి చేరుకోగానే ప్రయాణీకులు స్విగ్గీ ద్వారా ప్రీ-ఆర్డర్ చేసిన ఆహార పదార్థాలను ఇస్తారు.