నీరవ్‌ బ్యాంకు ఖాతాలను సీజ్‌ చేసిన స్విస్‌

నీరవ్‌ బ్యాంకు ఖాతాలను సీజ్‌ చేసిన స్విస్‌

పంజాబ్ నేషనల్ బ్యాంకు(PNB) కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు, ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోడీకి స్విట్జర్లాండ్ ప్రభుత్వం షాకిచ్చింది. నీరవ్‌  తో పాటు ఆయన సోదరి పూర్వి మోడీకి చెందిన నాలుగు బ్యాంకు స్విస్ బ్యాంకు అకౌంట్లను నిలిపివేసింది. ఈ నాలుగు బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.283 కోట్లు నగదును స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అక్రమ లావాదేవీల నిరోధక చట్టం కింద ఈ ఖాతాలను నిలిపేయాలంటూ భారత్ కు చెందిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ED) విజ్ఞప్తి తో స్విస్‌ అధికారులు ఈ చర్య తీసుకున్నారు. భారత బ్యాంకుల నుంచి కొల్లగొట్టిన మనీని అక్రమంగా స్విస్‌ ఖాతాల్లోకి మళ్లించారంటూ ED తెలిపింది. బెయిల్ కోసం నీరవ్ ఇప్పటివరకూ మూడుసార్లు దరఖాస్తు చేసుకోగా, అందుకు బ్రిటన్ లోని ఓ కోర్టు నిరాకరించింది. ప్రస్తుతం ప్రస్తుతం వాండ్స్‌వర్త్‌ జైల్లో ఉన్నాడు.