స్విచాఫ్ చేసి ఉన్నా మొబైల్ పేలింది

స్విచాఫ్ చేసి ఉన్నా మొబైల్ పేలింది

ఛార్జింగ్‌ పెడుతున్న సమయంలో లేదా మాట్లాడుతున్న సమయంలో ఫోన్లు పేలిన ఘటనలను మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఛార్జింగ్ పెట్టకుండా స్విచాఫ్‌ చేసి ఉన్న సమయంలో కూడా ఫోన్‌ పేలిందని ఓ కస్టమర్ ఫిర్యాదు చేశాడు. ‘వన్‌ ప్లస్‌’ ఫోన్‌.. స్విచాఫ్‌ చేసి, అన్‌ ప్లగ్‌ మోడ్‌లో ఉంచినప్పటికీ పేలిందని రాహుల్‌ హిమాలియన్‌ అనే వ్యక్తి కంప్లైంట్ చేశాడు.

ఈ నెల 3న ఈ ఘటన ఢిల్లీలో జరిగింది. రూమ్ టెంపరేచర్ 19 డిగ్రీలు ఉన్నప్పటికీ ఇలా జరిగిందని తెలిపాడు. తాను లేచి చూసేసరికి ఫోన్‌ కాలిపోతూ కనిపించిందని తెలిపాడు. వెంటనే దానిపై నీళ్లు చల్లి మంటలను ఆర్పివేసినట్లు చెప్పాడు. దీనికి సంబంధించిన ఫొటోలను అతడి స్నేహితుడు ట్విటర్‌ లో పోస్టు చేయడంతో ఇది వైరల్‌ గా మారింది.