
పారిస్: వరల్డ్ నంబర్‌వన్ ఇగా స్వైటెక్ (పోలెండ్), అమెరికా స్టార్ కొకో గాఫ్, ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీస్‌లోకి ప్రవేశించారు. మంగళవారం జరిగిన విమెన్స్ సింగిల్స్ క్వార్టర్స్‌లో టాప్‌సీడ్ స్వైటెక్ 6–0, 6–2తో ఒండ్రుసోవా (చెక్)పై గెలవగా, మూడోసీడ్ గాఫ్ 4–6, 6–2, 6–3తో ఎనిమిదో సీడ్ ఆన్స్ జాబెర్ (ట్యూనీసియా)ని ఓడించింది. దీంతో గాఫ్ వరుసగా మూడో గ్రాండ్‌స్లామ్‌లో సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. మెన్స్ సింగిల్స్‌లో జానిక్ సినర్ సెమీస్ ఫైనల్ చేరాడు. క్వార్టర్‌ఫైనల్లో ---రెండోసీడ్ సినర్ (ఇటలీ) 6–2, 6–4, 7–6 (7/3)తో పదోసీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా)పై గెలిచి ముందంజ వేశాడు.
గాయంతో జొకోవిచ్ ఔట్
మోకాలి గాయంతో టాప్‌సీడ్ నొవాక్ జొకోవిచ్.. ఫ్రెంచ్ ఓపెన్ నుంచి తప్పుకున్నాడు. దీంతో టైటిల్‌ను నిలబెట్టుకునే చాన్స్‌తో పాటు వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్ కూడా కోల్పోనున్నాడు. ఫ్రాన్సిస్కో సెరుండోలోతో జరిగిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో జొకో మోకాలికి గాయం కావడంతో ఎంఆర్‌ఐ స్కాన్ చేశారు. ఇందులో గాయం పెద్దదని తేలడంతో అతను టోర్నీ నుంచి వైదొలిగాడు. ఫలితంగా కాస్పర్ రూడ్ క్వార్టర్ ఫైనల్లో వాకోవర్‌తో నేరుగా సెమీస్ చేరుకున్నాడు.