
పారిస్: వరల్డ్ నంబర్ వన్, టాప్ సీడ్ ఇగా స్వైటెక్ ఫ్రెంచ్ ఓపెన్ విమెన్స్ సింగిల్స్‌లో సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. టోర్నీలో ఇప్పటిదాకా ఒక్క సెట్ కూడా కోల్పోని స్వైటెక్ అదే జోరును కొనసాగిస్తూ క్వార్టర్స్‌లో అమెరికా టీనేజర్ కొకొ గాఫ్ పని పట్టింది. బుధవారం ఏకపక్షంగా సాగిన పోరులో స్వైటెక్ (పోలాండ్) 6–4, 6–2తో ఆరో సీడ్ గాఫ్‌ను చిత్తు చేసింది.
గాఫ్‌తో ముఖాముఖి రికార్డును 7–0కు పెంచుకుంది. సెమీస్‌లో ఆమె బీట్రిజ్ హదాద్ పోటీ పడనుంది. మరో క్వార్టర్ ఫైనల్లో 14వ సీడ్ హదాద్ (బ్రెజిల్) 3–6, 7–6 (7/5), 6–1తో జబెర్ (ట్యునీసియా)కు షాకిచ్చి సెమీస్‌లో అడుగు పెట్టింది. మెన్స్ సింగిల్స్ క్వార్టర్స్‌లో జర్మనీ స్టార్22వ సీడ్ జ్వెరెవ్ 6–4, 3–6, 6–3, 6–4తో యిచెవర్ (అర్జెంటీనా)ను ఓడించి సెమీస్ చేరాడు.