వక్ఫ్ బోర్డు చైర్మన్​గా ..హజ్మతుల్లా హుస్సేని బాధ్యతల స్వీకరణ

వక్ఫ్ బోర్డు చైర్మన్​గా ..హజ్మతుల్లా హుస్సేని బాధ్యతల స్వీకరణ

అటెండ్ అయిన డిప్యూటీ సీఎం భట్టి, ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, వినోద్

హైదరాబాద్, వెలుగు: వక్ఫ్ బోర్డు చైర్మన్ గా సయ్యద్ హజ్మతుల్లా హుస్సేని బాధ్యతలు చేపట్టారు. బుధవారం నాంపల్లి హజ్ హౌజ్ లో జరిగిన ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం, ఫైనాన్స్ మినిస్టర్ భట్టి విక్రమార్క, చెన్నూరు, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, గడ్డం వినోద్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ప్రభుత్వ సలహా దారు షబ్బీర్ ఆలీలు అటెండ్ అయి హుస్సేనికి శుభాకాంక్షలు చెప్పారు. ముస్లిం మత పెద్దలు హుస్సేనిని  ఆశీర్వదించారు. 

ఈ సందర్భంగా పలు ఫైళ్లపై కొత్త చైర్మన్ సంతకాలు చేశారు. 25 ఏండ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో పని చేసినందుకు గుర్తింపుగా చైర్మన్ గా తనకు సీఎం రేవంత్ రెడ్డి పెద్ద గురుతర బాధ్యత  అప్పగించారని ఆయన అన్నారు.