సయ్యద్‌‌‌‌ మోదీ ఇంటర్నేషనల్‌‌‌‌ సూపర్‌‌‌‌–300 టోర్నీ: రెండో రౌండ్‌లో ట్రీసా–గాయత్రి

సయ్యద్‌‌‌‌ మోదీ ఇంటర్నేషనల్‌‌‌‌ సూపర్‌‌‌‌–300 టోర్నీ: రెండో రౌండ్‌లో ట్రీసా–గాయత్రి

లక్నో: ఇండియా విమెన్స్‌‌‌‌ డబుల్స్‌‌‌‌ షట్లర్లు ట్రీసా జోలీ–గాయత్రి గోపీచంద్‌‌‌‌.. సయ్యద్‌‌‌‌ మోదీ ఇంటర్నేషనల్‌‌‌‌ సూపర్‌‌‌‌–300 టోర్నీలో రెండో రౌండ్‌‌‌‌లోకి ప్రవేశించారు. మంగళవారం జరిగిన డబుల్స్‌‌‌‌ తొలి రౌండ్‌‌‌‌లో డిఫెండింగ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌ ట్రీసా–గాయత్రి 19–21, 22–20, 21–9తో చెంగ్‌‌‌‌ సు హుయ్‌‌‌‌–టాంగ్‌‌‌‌ జింగ్ యి (మలేసియా)పై గెలిచారు. 

భుజం గాయంతో ఐదు నెలల పాటు ఆటకు దూరంగా ఉన్న గాయత్రి ఈ మ్యాచ్‌‌‌‌లో ఆకట్టుకుంది. ప్రియా–శ్రుతి మిశ్రా 21–8, 21–11తో పీవా ఈవాంజెలిన్‌‌‌‌–సమృద్ధి సింగ్‌‌‌‌పై నెగ్గారు. మెన్స్‌‌‌‌ డబుల్స్‌‌‌‌లో హరిహరన్‌‌‌‌–ఎంఆర్‌‌‌‌ అర్జున్‌‌‌‌ 21–11, 21–13తో ఆయుష్‌‌‌‌ మకిజా–సుజయ్‌‌‌‌ తంబోలిపై, పృథ్వీ కృష్ణమూర్తి–సాయి ప్రతీక్‌‌‌‌ 21–8, 21–17తో స్వర్ణరాజ్‌‌‌‌ బోరా–నిబిర్‌‌‌‌ రంజన్‌‌‌‌పై గెలిచారు. 

విప్లవ్‌‌‌‌ కువాలే–విరాజ్‌‌‌‌ కువాలే జోడీ కూడా శుభారంభం చేసింది. మెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌లో ఆర్య, అభినవ్‌‌‌‌, భరత్‌‌‌‌, ఒరిజిత్‌‌‌‌ చాలియా మెయిన్‌‌‌‌ డ్రాకు క్వాలిఫై అయ్యారు. మిక్స్‌‌‌‌డ్‌‌‌‌ డబుల్స్‌‌‌‌లో లాల్‌‌‌‌రామసంగా–తారిణి సూరి 21–13, 21–15తో మిశా జిల్బెర్మాన్‌‌‌‌ (ఇజ్రాయిల్‌‌‌‌)–అగ్నేస్‌‌‌‌ కొరోసి (హంగేరి)పై, భవ్యా చాబ్రా–విశాఖ టోపో 21–19, 21–15తో డేవార్ట్‌‌‌‌ మన్‌‌‌‌–నిషు మాలిక్‌‌‌‌పై గెలిచారు.