హైదరాబాద్, వెలుగు: టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీ (4/30) నాలుగు వికెట్లతో సత్తా చాటినా.. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నమెంట్‌లో బెంగాల్ జట్టు క్వార్టర్ ఫైనల్ చేరలేక ఇంటిదారి పట్టింది. ఉప్పల్ స్టేడియంలో సోమవారం జరిగిన గ్రూప్–సి మ్యాచ్‌లో హర్యానా 24 రన్స్ తేడాతో బెంగాల్‌ను ఓడించి క్వార్టర్ ఫైనల్ చేరుకుంది. తొలుత హర్యానా నిర్ణీత 20 ఓవర్లలో 191/9 స్కోరు చేసింది. నిశాంత్ సిద్ధు (48), అంకిత్ కుమార్ (46) రాణించారు. షమీ నాలుగు వికెట్లు పడగొట్టగా.. ఆకాశ్ దీప్ రెండు వికెట్లు తీశాడు. అనంతరం ఛేజింగ్‌లో బెంగాల్ ఓవర్లన్నీ ఆడి 167 రన్స్‌కే ఆలౌటైంది.
అభిషేక్ పోరెల్ (47), వ్రితిక్ చటర్జీ (44) రాణించినా ఫలితం లేకపోయింది. జింఖానా గ్రౌండ్‌లో జరిగిన మరో మ్యాచ్‌లో పంజాబ్ 75 రన్స్ తేడాతో గుజరాత్‌ను ఓడించింది. ఫలితంగా 20 పాయింట్లు , +2.71 రన్ రేట్‌తో గ్రూప్ టాపర్‌గా క్వార్టర్స్ బెర్తు దక్కించుకుంది. హర్యానా (20 పాయింట్లు) రెండో ప్లేస్‌తో ముందంజ వేసింది. మరో మ్యాచ్‌లో బరోడా 13 రన్స్ తేడాతో సర్వీసెస్‌ను ఓడించినా మూడో ప్లేస్‌తో సరిపెట్టి క్వార్టర్స్ చేరలేకపోయింది.
