కిడ్నీ సమస్యను గుర్తించండి ఇలా..

కిడ్నీ సమస్యను గుర్తించండి ఇలా..

మన శరీరంలో ప్రతీ అవయం ఎంతో ముఖ్యమైనది. అవయవాలను ఎంత ఆరోగ్యంగా ఉంచుకుంటే అంత మంచిది. మన శరీరంలో అలాంటి ముఖ్యమైన అవయవాలలో  ఒకటి కిడ్నీలు. ఏదైనా సమస్య వచ్చాక బాధపడటం కంటే రాకముందే మన జాగ్రత్తలో ఉంటే బెటర్. కిడ్నీ వ్యాధి లక్షణాలేంటో తెలుసుకుందాం.

కిడ్నీ వ్యాధి లక్షణాలు

  • కిడ్నీ సమస్యలున్న వారికి ఆక్సిజన్ లేవల్స్ తగ్గుతాయి. రక్తం స్థాయి కూడా తగ్గిపోతుంది. నీరసంగా,అలసటగా కూడా ఉంటుంది. శ్వాసకూడా సరిగా  ఆడదుద ని వల్ల బీపీ వస్తుంది.
  • మూత్రం పోసేటప్పుడు కష్టంగా ఉంటే కూడా కిడ్నీ సమస్య ఉన్నట్లేనని గుర్తించి డాక్టర్ ను సంప్రదించాలి.
  • కిడ్నీ సమస్యలున్న వారికి రక్తంలో మలినాలు, వ్యర్తాలు పేరుకుపోతాయ. నాలుకపై రుచిని చూసే గుళికల పనితీరు ప్రభావం తగ్గుతుంది. దీని వల్ల రుచిని గుర్తించలేం.
  • కిడ్నీలు  సరిగా పనిచేయకపోవడం వల్ల రక్తంలోని వ్యర్థాలు బయటకు వెళ్లవు. దీని ప్రభావం వల్ల సరిగా నిద్రపట్టదు.
  • శరీరంలో మలినాలు,రసాయనాలు పేరుకుపోయి శరీరంపై పలు చోట్ల అంటే పాదాలు, చేతుల వద్ద ఉబ్బుతాయి.
  • కిడ్నీ సమస్యలున్న వారికి విటమిన్ డీ వల్ల విడుదలయ్యే ఎరిత్రోపొయెటిన్ అనే హార్మోన్ విడుదల కాదు. దీని వల్ల ఎర్రరక్త కణాల ఉత్పత్తి తగ్గి కండరాలు, మెదడు బలహీనమవుతాయి.
  • మూత్రంలో మంట, మూత్రం రంగు మారడం, అధిక రక్తపోటు వంటి లక్షణాల ద్వారా కిడ్నీ సమస్యలను గుర్తించవచ్చు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

  • కిడ్నీ సమస్యలున్న వారు వీలైనంత ఎక్కువగా నీరు తాగాలి. రోజుకు కనీసం రెండు లీటర్లు తాగాలి. దీని వల్ల శరీరం ఢైడ్రేట్ గా ఉంచుతుంది. వ్యర్థాలు కూడా బయటకు పోతాయి.
  • డ్రింకింగ్, స్మోకింగ్ అలవాట్లను మానుకోవాలి.లేకపోతే హైబీపీ వచ్చి అది కిడ్నీ క్యాన్సర్ కు దారి తీసే అవకాశం ఉంది.
  • సాధ్యమైనంత వరకు ఉప్పు వాడకం తగ్గించాలి. ఎందుకంటే అందులోని సోడియం బీపీని పెంచుతుంది.దీని వల్ల కిడ్నీ సమస్యలు వస్తాయి.
  • సమయానికి పోషకాలతో కూడిన భోజనం తగిన మోతాదులో తీసుకోవాలి. జంక్ ఫుడ్ తీసుకోకూడదు.