Health Alert: మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?, అయితే జాగ్రత్త... గుండెపోటు రావచ్చు

Health Alert: మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?, అయితే జాగ్రత్త... గుండెపోటు రావచ్చు

మారుతున్న అలవాట్లు, జీవన విధానాల కారణంగా వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు రావటం ఎక్కువయ్యింది ఈ మధ్య. అప్పటి వరకూ ఆరోగ్యాంగా ఉన్నవారు కూడా జిమ్ లో వర్కౌట్ చేస్తూనో, పార్టీలో డ్యాన్స్ చేస్తూనో సడన్ గా గుండె పోతూ వచ్చి కుప్పకూలిన సందర్భాలు కూడా చాలా చూశాం. అయితే, గుండెపోటు రావటానికి కొద్దీ రోజుల ముందు నుండే మన బాడీ కొన్ని హింట్స్ ఇస్తుందని,వాటిని ముందుగానే గ్రహించి జాగ్రత్త పడితే గుండెపోటు రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చని నిపుణులు చెప్తున్నారు. గుండెపోటు రావటానికి ముందు మన బాడీ ఇచ్చే ఆ హింట్స్ ఏంటి, వాటిని ఎలా గ్రహించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

గుండెపోటు వచ్చినవారిలో 45శతం మందిలో చాలా రోజుల ముందు నుండే ఛాతిలో నొప్పి ఉన్నట్లు గుర్తించారు. దీంతోపాటు ఊపిరి సరిగా ఆడకపోవడం, అలసట వంటి లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ లక్షణాలు కొంతమందిలో వారం లేదా 4, 5రోజుల ముందు నుండి కనిపిస్తే 50శాతం మందిలో గుండెపోటు రావటానికి 48గంటల ముందు నుండి కనిపించినట్లు గుర్తించారు డాక్టర్లు. ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ గుండెపోటు రావటానికి ముఖ్య కారణాలని డాక్టర్లు అంటున్నారు. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా సంబంధిత డాక్టర్లను సంప్రదిస్తే మన ప్రాణాలను కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు డాక్టర్లు.