Syria Earthquake: సిరియాలో కొనసాగుతున్న సహాయక చర్యలు

Syria Earthquake: సిరియాలో కొనసాగుతున్న సహాయక చర్యలు

సిరియాలో సమయం గడుస్తున్నకొద్దీ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. శిథిలాల కింద చిక్కుకున్నవాళ్ల కోసం కుటుంబ సభ్యులు ఆశతో ఎదురుచూస్తున్నారు. సిరియాలో శుక్రవారం వరకు 3,500 మంది చనిపోగా.. తర్వాత నుంచి అక్కడి ప్రభుత్వం మృతుల సంఖ్యను అధికారికంగా ప్రకటించడం ఆపేసింది. 

సిరియా జబ్లేహ్ కు చెందిన 23 ఏళ్ళ జఖారియా శిథిలాల కింద మురుగు నీటిని తాగి ప్రాణాలు కాపాడుకున్నాడు. ఏడు నెలల బాబుతో పాటు మరో నలుగురిని సిరియా సహాయక బృందాలు రక్షించాయి. జైనెప్ కహ్రామన్ అనే మహిళను జర్మన్ బృందం 50 గంటలు కష్టపడి రక్షించారు. కానీ, ఆవిడ హాస్పిటల్ లో చేరిన కొన్ని గంటలకే చనిపోయింది.