కేసీ వేణుగోపాల్లో భేటీ కానున్న టీ కాంగ్రెస్ నేతలు

కేసీ వేణుగోపాల్లో భేటీ కానున్న టీ కాంగ్రెస్ నేతలు

హైకమాండ్ పిలుపుతో ఢిల్లీకి వెళ్లిన టీ కాంగ్రెస్ ముఖ్య నేతలు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తో సమావేశం కానున్నారు. సాయంత్రం 5 గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో భేటీ జరగనుంది. సమావేశంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, జానా రెడ్డి తదితరలు పాల్గొననున్నారు. రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై ప్రధానంగా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. అధిష్టానం దూతలుగా ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా పలువురు నేతలు రాజగోపాల్ రెడ్డిని కలిసి బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఢిల్లీ వచ్చి అగ్ర నేతలతో మాట్లాడాలని చెప్పారు. అయితే ఆయన మాత్రం  అందుకు నిరాకరించారు. ఢిల్లీ వచ్చే ప్రసక్తేలేదని, అవసరముంటే వారే తన వద్దకు వచ్చి మాట్లాడాలని చెప్పారు. 

రాజగోపాల్ రెడ్డి పార్టీ మారనున్నారన్న ఊహాగానాల నేపధ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ పార్టీ సీనియర్లను హస్తినకు రావాలని ఆదేశించింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఇప్పటికే ఢిల్లీలో ఉండగా.. జానారెడ్డి హుటాహుటిన హస్తినకు బయలుదేరారు.