రుణాల చెల్లింపులో మహిళా సంఘాలు ఆదర్శం

రుణాల చెల్లింపులో మహిళా సంఘాలు ఆదర్శం

బెల్లంపల్లి, వెలుగు : మంచిర్యాల జిల్లాకు చెందిన మహిళా స్వశక్తి సంఘాలకు ఇచ్చిన రూ. 622 కోట్ల రుణాల్లో 99 శాతం తిరిగి చెల్లించి ఆదర్శంగా నిలిచాయని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మంచిర్యాల రీజినల్ మేనేజర్ టి.మురళీ మనోహర్ రావు అన్నారు. శుక్రవారం బెల్లంపల్లి పట్టణంలో గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో

జరిగిన కార్యక్రమంలో బెల్లంపల్లి మండలానికి చెందిన స్వయం సహాయక సంఘాలకు రూ .9 కోట్ల రుణాలను చెక్కుల ద్వారా అందజేశారు. కార్యక్రమంలో దక్కన్ గ్రామీణ బ్యాంక్ ఏవో శ్రీనివాస్, చీఫ్ మేనేజర్ రవికుమార్, ఏపీఎంలు శ్యామల, రాంచందర్, బీఎల్​సీసీ సత్యనారాయణ గౌడ్, గ్రామ ఐక్య సంఘాల అధ్యక్షులు, సీసీలు పాల్గొన్నారు.