డిప్యూటీ స్పీకర్ అభ్యర్థిగా పద్మారావు నామినేషన్

డిప్యూటీ స్పీకర్ అభ్యర్థిగా పద్మారావు నామినేషన్

రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా నామినేషన్ వేశారు ఎమ్మెల్యే టి.పద్మారావు గౌడ్. నిన్న రాత్రి సీఎం క్యాంప్ ఆఫీస్ అయిన ప్రగతి భవన్ నుంచి సమాచారం అందుకున్న పద్మారావు… ఇవాళ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా నామినేషన్ వేశారు.

సీఎల్పీలో నేతలతో కేటీఆర్ భేటీ

పద్మారావు డిప్యూటీ స్పీకర్ గా ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాలంటూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రతిపక్ష నేతలతో మాట్లాడారు. ఈ ఉదయం అసెంబ్లీ ప్రారంభానికి ముందు సీఎల్పీలో మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో సమావేశం అయ్యారు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్.

ఆతర్వాత మీడియాతో మాట్లాడిన కేటీఆర్ “డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు సహకరించాలని కోరాను. ఉత్తమ్ , భట్టి .. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల గురించి అడిగారు. మేం గెలుస్తామని ధీమాగా ఉన్నాం. ఏదైనా ఉంటే పార్టీ అధ్యక్షుడితో మాట్లాడండి ” అని కాంగ్రెస్ నేతలకు చెప్పినట్టుగా వివరించారు కేటీఆర్.