హైదరాబాద్, వెలుగు: బీఈడీ కోర్సులో చేరేందుకు ఎడ్‌సెట్‌కు అప్లై చేసిన అభ్యర్థుల కోసం టీ–సాట్ నెట్‌వర్క్ స్పెషల్ క్లాసులు నిర్వహించనున్నది. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ప్రిపరేషన్ క్లాసులు ఉంటాయని ప్రకటించింది. ఈ క్లాసుల షెడ్యూల్ పోస్టర్‌ను శుక్రవారం టీసాట్ సీఈఓ బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డితో కలిసి మంత్రి శ్రీధర్ బాబు ఆవిష్కరించి మాట్లాడారు. బయట కోచింగ్‌లకు వెళ్లలేని వాళ్లు టీ–సాట్ క్లాసులను సద్వినియోగం చేసుకుని మంచి ర్యాంకులు కొట్టాలని సూచించారు.
స్టూడెంట్ల కోసం క్వాలిటీ కంటెంట్ అందిస్తున్న టీ–సాట్ సీఈఓను మంత్రి అభినందించారు. వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ..ఫిబ్రవరి 2 నుంచి మే 11 వరకు కోచింగ్ కొనసాగుతుందన్నారు.
