క్రికెట్ ఫ్యాన్స్ కు బంపర్ న్యూస్. 2026 టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల చేసింది ఐసీసీ. ఈసారి T20 టోర్నమెంట్ ను భారత్, శ్రీలంకలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు ఈ టోర్నమెంట్ జరగనుంది. టోర్నమెంట్ లో భాగంగా తొలి మ్యాచ్ ఫిబ్రవరి 7న పాకిస్తాన్- నెదర్లాండ్ మధ్య జరగుతుంది.
క్రికెట్ ప్రపంచంలో అత్యంత రసవత్తరంగా, ఫ్యాన్స్ థ్రిల్లింగ్ గా ఫీలయ్యే ఇండియా-పాక్ జట్ల మధ్య మ్యాచ్ ఫిబ్రవరి 15న కొలంబోలో జరగనుంది. ఇండియా, పాకిస్తాన్ , అమెరికా(USA), నమీబియా, నెదర్లాండ్స్ ఒకే గ్రూపులో ఉన్నాయి.
ఈసారి ఈ మెగా టోర్నీలో 20 జట్లు తలపడనున్నాయి. భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, యూఏఈ, ఒమన్, వెస్టిండీస్, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వే, ఐర్లాండ్, ఇంగ్లాండ్, నెదర్లాండ్స్, ఇటలీ, నేపాల్, పాకిస్థాన్ జట్లు టోర్నమెంట్ లో భాగం కానున్నాయి.
భారత్‌లో జరిగే మ్యాచ్ లు 5 స్టేడియాల్లో జరుగుతాయి. అహ్మదాబాద్, దిల్లీ, కోల్‌కతా, చెన్నై, ముంబయి స్టేడియాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఇక శ్రీలంక లో 3 వేదికల్లో నిర్వహించనున్నారు. ప్రారంభ, ఫైనల్ మ్యాచ్‌లు అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో నిర్వహించనున్నారు.
బీసీసీఐ పీసీబీ మధ్య పరస్పర ఒప్పందం ప్రకారం.. పాకిస్తాన్ తన అన్ని మ్యాచ్‌లను శ్రీలంకలో ఆడుతుంది. పాకిస్తాన్ ఫైనల్‌కు అర్హత సాధిస్తే, ఆ మ్యాచ్ కూడా శ్రీలంకలోని కొలంబోలో జరపనున్నారు. అలాగే సెమీఫైనల్స్ లోని ఒక మ్యాచ్‌కు ముంబయిలోని వాంఖడే వేదిక కానుంది. భారత్ జట్టు ఈ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది.
గ్రూప్-A మ్యాచ్ల షెడ్యూల్:
గ్రూప్-B మ్యాచ్ల షెడ్యూల్:
గ్రూప్-C మ్యాచ్ల షెడ్యూల్:
గ్రూప్-D మ్యాచ్ల షెడ్యూల్:
