ఐపీఎల్‌కు లైన్‌ క్లియర్‌ అయినట్లే..

ఐపీఎల్‌కు లైన్‌ క్లియర్‌ అయినట్లే..

మెల్‌‌బోర్న్‌‌: ఈ ఏడాది టీ20 వరల్డ్‌‌ కప్‌‌ పోస్ట్‌‌ పోన్‌‌ అయితే… ఐపీఎల్‌‌కు లైన్‌‌ క్లియర్‌‌ అయినట్లేనని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌‌ మార్క్‌‌ టేలర్‌‌ అన్నాడు. ఈ టైమ్‌‌ స్లాట్‌‌లో అన్ని కంట్రీలు ఫ్రీగా ఉంటాయి కాబట్టి లీగ్‌‌ను నిర్వహించడానికి బీసీసీఐ ముందుకొస్తుందన్నాడు. అయితే ఐపీఎల్‌‌లో ఆడాలనుకునే ప్లేయర్లకు సంబంధించిన ట్రావెలింగ్‌‌ బాధ్యతను నేషనల్‌‌ బోర్డులు తీసుకోవద్దని సూచించాడు. క్రికెటర్లు వ్యక్తిగతంగా దీనిని చూసుకోవాలన్నాడు. ‘ఇప్పుడున్న పరిస్థితుల్లో టీ20 వరల్డ్‌‌కప్‌‌ను నిర్వహించడం సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే 15 టీమ్‌‌లు ఆస్ట్రేలియా రావాలి. ఏడు ప్లేస్‌‌ల్లో 45 మ్యాచ్‌‌ల వరకు ఆడాలి. ట్రావెలింగ్‌‌ కూడా డిఫికల్ట్​గా మారొచ్చు. టోర్నీకి ముందు 14 రోజుల క్వారంటైన్‌‌ కూడా చాలా కష్టం. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే టోర్నీ సాధ్యం కాకపోవచ్చు. కాబట్టి మెగా ఈవెంట్‌‌ను ఐసీసీ పోస్ట్‌‌పోన్‌‌ చేయాలనుకుంటే మాత్రం ఐపీఎల్‌‌కు డోర్స్‌‌ తెరిచినట్లే. మరో కంట్రీకి టీమ్‌‌ మొత్తం ప్రయాణించడం కంటే ప్లేయర్లు ఒక్కొక్కరుగా వెళ్లడం మంచిది ’ అని టేలర్‌‌ వివరించాడు. టీ20 వరల్డ్‌‌కప్‌‌ను కాదని ఐపీఎల్‌‌ జరిగితే బీసీసీఐతో చాలా విషయాలను ఆస్ట్రేలియా చర్చించొచ్చన్నాడు. లీగ్‌‌ కోసం తమ ప్లేయర్లను పంపించాలంటే.. వచ్చే సమ్మర్‌‌లో టీమిండియా ఇక్కడ పర్యటించేలా ఒప్పించాలన్నాడు.

సచిన్‌ను190 వద్దే ఔట్‌ చేశా