
అటు నార్త్ లోను, ఇటు సౌత్ లోను కూడా బయోపిక్స్ పోటాపోటీగా రూపొందుతున్నాయి. రాజకీయ, సినీ, క్రీడారంగాల్లోని ప్రముఖులందరి జీవితాలు ఒకదాని తర్వాత ఒకటిగా తెరకెక్కుతున్నాయి. ఆ క్రమంలో వస్తున్నదే ‘శభాష్ మిథూ’. మహిళా టీమ్ ఇండియా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ బయోపిక్ ఇది. ఆమె సారథ్యంలో మహిళా క్రికెట్ టీమ్ ఎన్నో విజయాలను అందుకుంది. ఆ సక్సెస్ ఫుల్ జర్నీయే సినిమాగా వస్తోంది. మిథాలీ పాత్రలో తాప్సీ నటిస్తోంది. ఈ పాత్ర కోసం క్రికెట్‌లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంది తాప్సీ. రీసెంట్‌గా రిలీజైన ఆమె ఫస్ట్ లుక్ చూస్తుంటే.. మిథాలీ పాత్రకి తాప్సీ పర్‌ఫెక్ట్ అనిపిస్తోంది. క్రికెటర్ డ్రెస్ లో భారీ షాట్ కొడుతున్నట్టుగా ఉన్న ఈ పోజ్ ఆకట్టుకుంది. రాహుల్ ధోలాకియా దర్శకత్వంలో వయాకమ్ 18 సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే యేడు ఫిబ్రవరి 5న హిందీ, తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ విడుదల చేస్తున్నారు. ఏ పాత్ర చేసినా శభాష్ అనిపించుకుంటోన్న తాప్సీ.. ఈసారి ఫస్ట్ లుక్‌తో శభాష్ తాప్సీ అనిపించేసుకుంది. మరి వెండితెరపై ఎంతగా అలరిస్తుందో చూడాలి.
మరిన్ని వార్తలు…
ముస్లిం మహిళలు మసీదులో ప్రార్థనలు చేయవచ్చు
CAA వ్యతిరేక నిరసన కారులపై కాల్పులు.. ఇద్దరు మృతి
లంచం ఇవ్వలేదని చెప్పుతో కొట్టిన మహిళా ఆఫీసర్
నీళ్లకు ఎక్స్‌పైరీ డేట్ ఉందా?