తెలంగాణ రాష్ట్రంలో 3 ఇరిగేషన్ ప్రాజెక్టులకు టీఏసీ గ్రీన్ సిగ్నల్

తెలంగాణ రాష్ట్రంలో 3 ఇరిగేషన్  ప్రాజెక్టులకు టీఏసీ గ్రీన్ సిగ్నల్

తెలంగాణకు చెందిన మూడు ఇరిగేషన్ ప్రాజెక్టులకు టెక్నికల్ అడ్వైజరీ కమిటీ (టీఏసీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిలో ముక్తేశ్వర- చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం (భూపాలపల్లి జిల్లా), ఛ‌నాక కొరాట బ్యారేజీ (ఆదిలాబాద్ జిల్లా), చౌటుపల్లి హనుమంత రెడ్డి ఎత్తిపోతల పథకం (నిజామాబాద్ జిల్లా)లు ఉన్నాయి. ఢిల్లీలోని శ్రమ్ శక్తి భవన్ లో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సెక్రెటరీ పంకజ్ కుమార్ అధ్యక్షతన జరిగిన టీఏసీ మీటింగ్ లో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. 

ఈ మీటింగ్ లో జలశక్తి మంత్రిత్వ శాఖ అడిషనల్ సెక్రెటరీ దేబ ముఖర్జీ, కేంద్ర జలసంఘం ఛైర్మన్ ఆర్.కె గుప్తా, సభ్యులు చంద్రశేఖర అయ్యర్, రుష్విందర్ వోర, కేంద్ర జలసంఘం చీఫ్ ఇంజనీర్లు పైథాంకర్, బీపీ పాండే, వివిధ విభాగాల డైరెక్టర్లు, ఆర్థిక, వ్యవసాయ, ఇంధన మంత్రిత్వ శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు. వీరితో పాటు తెలంగాణ నుంచి ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రజత్ కుమార్, ఇంజనీర్ ఇన్ చీఫ్ లు సీ. మురళీధర్, ఎన్. వెంకటేశ్వర్లు (రామగుండం), చీఫ్ ఇంజనీర్లు శ్రీనివాస్ (ఆదిలాబాద్), మధుసూధన్ (నిజామాబాద్), సీఎంఓ ఎస్ డి శ్రీధర్ రావు దేశ్ పాండే హాజరయ్యారు.