కీసర రామలింగేశ్వరుడికి బంగారు నాగభరణం

కీసర  రామలింగేశ్వరుడికి బంగారు నాగభరణం

కీసర గుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామికి తాడ్బండ్​కు చెందిన సదా నరసింహారెడ్డి దంపతులు బంగారు తాపడం కలిగిన నాగభరణాన్ని విరాళంగా సమర్పించారు. సోమవారం గర్భాలయంలో శివలింగానికి ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ఈ నాగభరణాన్ని స్వామివారికి అలంకరించారు. ఈ తాపడం విలువ సుమారు రూ.6.5 లక్షల వరకు ఉంటుందన్నారు.