విమానాల్లో మాదిరిగా రైళ్లల్లోనూ లగేజీపై లిమిట్స్: ప్రయాణికులకు ఇండియన్ రైల్వే షాక్!

విమానాల్లో మాదిరిగా రైళ్లల్లోనూ లగేజీపై లిమిట్స్: ప్రయాణికులకు ఇండియన్ రైల్వే షాక్!

Indian Railways: భారతీయ రైల్వే సంస్థ ఇకపై లగేజీ విషయంలోనూ కఠినంగా రూల్స్ అమలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు మనం విమానాల్లో ప్రయాణించే వారిపై మాత్రమే లగేజీ విషయంలో పరిమితుల గురించి వింటుంటాం. కానీ రైళ్లలో కూడా ప్రయాణికులు క్యారేజ్ చేసే బ్యాకేజీ సైజుతో పాటు వాటి బరువు విషయంలో కొత్త నిబంధనలకు ఇండియన్ రైల్వే ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడైంది. ముందుగా దీనిని ప్రయోగాత్మకంగా కొన్ని స్టేషన్లలో విమానాశ్రయాల్లో మాదిరిగానే ప్రారంభించాలని రైల్వే సంస్థ నిర్ణయించింది. 

ప్రయాణికులు ముందుగా తమ లగేజీని ఎలక్ట్రానిక్ లగేజీ మెషిన్లలో రైల్వే స్టేషన్ల వద్ద ఉంచి బరువు ఎంతుందో చూస్తారని తెలుస్తోంది. ముందుగా దీనిని ప్రయాగ్ రాజ్, మిజోరాం, ఖాన్ పూర్, అలీఘడ్ జంక్షన్ స్టేషన్లలో స్టార్ట్ చేస్తున్నట్లు వెల్లడైంది. ప్రయాణికులు వెళుతున్న క్లాస్ ఆధారంగా వారికి అనుమతింటే ఉచిత లగేజీ కూడా మారిపోతుంటుందని తెలుస్తోంది. కేవలం ప్యాసింజర్ కంపార్టమెంట్లలో మాత్రమే లగేజీ పూర్తిగా అనుమతించబడిన పరిమితి వరకు ఉచితంగా క్యారీ చేసేందుకు వీలుంటుందని తెలుస్తోంది. 

ALSO READ : ఇలాంటివి నమ్మితే అడుక్కుతింటారు

వివిధ క్లాస్ ప్రయాణికులకు ఉచిత లిమిట్ పైన క్యారీ చేసే లగేజీకి ఎల్ స్కేల్ కింద 1.5 రెట్ల వరకు చార్జ్ చేస్తారు. ఇందులో కనీసం 10 కేజీల బరువుకు 50 కిలోమీటర్లకు రూ.30 ఛార్జీ ఉండనుందట. ఇక 5-12 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు గరిష్ఠంగా 50 కేజీల వరకు లగేజీ క్యారీ చేసేందుకు అనుమతి ఉంటుంది. ఒకవేళ ఓవర్ సైజ్ ఉన్న బ్యాగేజీ ప్రయాణికులకు రైలులోకి ఎక్కేటప్పుడు అసౌకర్యాన్ని కలిగిస్తే దానికి పెనాల్టీ కూడా వేస్తారట. ఇప్పటికే లగేజీ విషయంలో రైల్వే రూల్స్ ఉండగా వాటిని అమలు చేయటంలో కఠినంగా ముందుకెళ్లాలని ప్రస్తుతం ప్రయత్నిస్తోంది.

ఇలా రూల్స్ కఠినంగా అమలు కారణంగా రైళ్లలో ఇరుకుగా ఉండటాన్ని తగ్గించొచ్చని రైల్వే సంస్థ భావిస్తోంది. అలాగే ప్రజలు రైలు ఎక్కేటప్పుడు బోర్డింగ్ వద్ద అడ్డుగా బ్యాగులు, లగేజీ లేకుండా నివారించాలని రైల్వే సంస్థ భావిస్తోంది. ఇది రైళ్లలో ప్రయాణాన్ని సురక్షితంగా అలాగే సౌకర్యవంతంగా మార్చుతుందని వారి ప్లాన్. స్కూటర్లు, సైకిళ్లు, ఇతర పెద్ద లగేజ్ పార్శిళ్లకు ఉచిత పరిమితి వర్తించదని ప్రయాణికులు గుర్తుంచుకోవాలి.