ఇలాంటివి నమ్మితే అడుక్కుతింటారు: రూ.21 వేల పెట్టుబడితో రూ.20 లక్షల ఆదాయం.. సోషల్ మీడియా ప్రచారంలో నిజం ఇదీ..!

ఇలాంటివి నమ్మితే అడుక్కుతింటారు: రూ.21 వేల పెట్టుబడితో రూ.20 లక్షల ఆదాయం.. సోషల్ మీడియా ప్రచారంలో నిజం ఇదీ..!

Nirmala Sitharaman AI Video: ఏఐ రాకతో డీప్ ఫేక్ వీడియోల చెలామణి సోషల్ మీడియాలో విచ్చలవిడిగా కొనసాగుతోంది. సినీ ప్రముఖుల నుంచి రాజకీయ నాయకుల వరకు ఎవ్వరినీ విడిచిపెట్టడం లేదు ఆర్థిక నేరగాళ్లు. తాజాగా నేరగాళ్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కి సంబంధించిన ఒక వీడియోను పెట్టుబడుల పేరుతో మాయగాళ్లు సోషల్ మీడియాలో విచ్చల విడిగా షేర్ చేస్తూ లక్షల మందిని మోసం చేస్తుండటంపై ప్రభుత్వ సంస్థ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఒక ఫ్యాక్ట్ చెక్ విడుదల చేసింది. 

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారమన్ రోజుకు రూ.21వేలు ఇన్వెస్ట్ చేస్తే రూ.60వేలు లాభం పొందొచ్చంటూ నేరగాళ్లు సర్క్యులేట్ చేస్తున్న వీడియోపై పీఐబీ స్పందించింది. రోజుకు 60 వేల రూపాయలు, నెలకు రూ.10 లక్షలు ఆదాయం పొందాలంటే క్వాంటమ్ ఏఐలో ఇన్వెస్ట్ చేయాలంటూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రజలకు చెబుతున్నట్లు ఆ వీడియోలో ఉంది. అయితే ఇది పూర్తిగా అబద్ధమని.. ఆర్థిక మంత్రి అలాంటి ప్రకటన లేదా సూచన ఎప్పుడూ ఎవ్వరికీ చేయలేదని పీఐబీ ఫేక్ వీడియోపై స్పందించింది.

ALSO READ : ఒడిశాలో బయటపడ్డ 20 వేల కేజీల గోల్డ్ రిజర్వ్స్..

ఏఐతో చేసిన సదరు వీడియోలో పూర్తిగా అవాస్తవాలు ప్రచారం చేస్తూ సామాన్యులను అధిక ఆదాయం ఆశచూపుతూ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నట్లు పీఐబీ ఎక్స్ వేదికగా చెప్పింది. కేవలం రూ.22వేల పెట్టుబడిని నెలలోనే రూ.10లక్షలుగా మారుతుందని ప్రచారం చేస్తున్న వీడియోలో చెప్పిన స్కీమ్ కి ప్రజలు దూరంగా ఉండాలని పీఐబీ కోరింది.

కేంద్ర ప్రభుత్వం గానీ లేదా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కానీ ఇలాంటి పెట్టుబడి స్కీమ్స్ ఏవీ ప్రకటించలేదని ప్రజలు గమనించాలని పీఐబీ కోరింది. అధిక ఆదాయం ఆశచూపుతున్న మోసగాళ్లకు దూరంగా ఉండాలని, వారి వలలో పడి కష్టపడి సంపాదించిన డబ్బును కోల్పోవద్దని సూచించింది. ఆర్థిక మంత్రి ఎప్పుడూ ఇలాంటి పెట్టుబడులను వీడియోల ద్వారా సోషల్ మీడియాలో ప్రచారం చేయలేదని చెప్పింది. క్వాంటమ్ ఏఐ పేరుతో సోషల్ మీడియా, ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి ఖాతాల్లో ప్రచారం అవుతున్న నిర్మలా సీతారామన్ వీడియో చూసి మోసపోవద్దని చెప్పింది పీఐబీ. ఇలాంటి వాటిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆర్థిక నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. 

వీడియోలో ఆర్థిక మంత్రి ఈ యాప్ క్రియేట్ చేసిన అంబానీ, నారాయణ మూర్తికి ధన్యవాదాలు చెబుతున్నట్లు ఉంది. తాము అనేక నెలల పాటు దీనిని పరీక్షించాకే అందుబాటులోకి తెచ్చినట్లు ఆమె చెబుతున్నట్లు ఉన్న ఏఐ ఫేక్ వీడియో పూర్తిగా అబద్ధమేనని పీఐబీ ప్రకటనతో తేలింది.