
బాలీవుడ్ స్టార్ హీరో ఆమీర్ ఖాన్ పై ఆయన సోదరుడు ఫైసల్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను ఇంట్లో బందించి పిచ్చివాడిగా చిత్రీకరించారని ఆరోపించారు. కుటుంబంతో తన సంబంధాలను పూర్తిగా తెంచుకుంటున్నట్లు ప్రకటించారు. భార్య ఉండగానే ఆమీర్ ఖాన్ వివాహేతర బంధం కొనసాగించారని, ఒక మగ బిడ్డ కూడా జన్మనిచ్చారని కీలక వ్యాఖ్యలు చేశారు.
నా పెద్ద అక్క నిఖాత్ మూడుసార్లు పెళ్లి చేసుకుంది. తన అన్న అమీర్ ఖాన్ మొదటి భార్య రీనాతో కలిసి ఉన్నప్పుడే జెస్సికాతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారని ఫైసల్ ఆరోపించారు. రీనాతో విడాకులు తీసుకున్న ఆమీర్ ఖాన్ ఎక్కువగా జెస్సికాతోనే ఉండేవారన్నారు. అయితే వారిద్దరూ పెళ్లి చేసుకోలేదని .. లివింగ్ రిలేషన్ లో ఉన్నారని చెప్పారు. వారికి ఒక బిడ్డ కూడా ఉన్నారని, అతని పేరు జాన్ అని పేర్కొన్నారు. కొంతకాలం తర్వాత అమీర్ ఖాన్, కిరణ్ రావు పెళ్లి చేసుకున్నారు. అప్పటికే జెస్సికాతో టచ్ లో ఉండేవారని ఫైసల్ ఆరోపించారు.
2002లో తన విడాకుల తర్వాత జరిగిన సంఘటనలను గుర్తు చేసుకున్నారు ఫైసల్ ఖాన్. మా కుటుంబం, ముఖ్యంగా మా అమ్మ నన్ను తన మొదటి కజిన్‌ను పెళ్లి చేసుకోమని బలవంతం చేసినట్లు ఆరోపణలు గుప్పించారు. నాకు ఆ పెళ్లి అస్సలు ఇష్టం లేదు, కానీ వారు నాపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. ఈ విషయంలో మా కుటుంబంతో చాలా గొడవలు జరిగాయి. అందుకే నేను వారికి దూరంగా ఉండడం మొదలుపెట్టాను. ఈ విషయంపై మా అమ్మ చాలా కోపంగా ఉన్నారు అని ఫైసల్ చెప్పారు.
ALSO READ : ఫ్యాన్స్ను ఉర్రూతలూగించేలా ‘థామ’ టీజర్..
ఆమీర్ ఖాన్ తనను ఏడాదికి పైగా ఇంట్లో బంధించి, స్కిజోఫ్రెనియా ఉందని, తాను పిచ్చివాడినని, సమాజానికి హాని చేస్తానని ప్రకటించారని ఫైసల్ ఆరోపించారు. అయితే దీనిపై ఆమిర్ కుటుంబం సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేసింది. ఫైసల్ వ్యాఖ్యలు బాధాకరమైనవి, తప్పుదారి పట్టించేవి అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు భారీ హృదయంతో, కొత్త ధైర్యంతో నేను నా కుటుంబ సంబంధాలను తెంచుకున్నట్లు ఫైసల్ ప్రకటించారు.