
నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. హిందీలో ఆమె ఆయుష్మాన్ ఖురానాతో కలిసి ‘థామ’ మూవీలో నటిస్తోంది. మాడాక్ హారర్-కామెడీ యూనివర్స్లో ‘థామ’ నాల్గవ భాగం.
ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వంలో హారర్ కామెడీ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. దినేష్ విజన్, అమర్ కౌశిక్ నిర్మిస్తున్నారు. దీపావళికి ఈ రొమాంటిక్ థ్రిల్లర్ థియేటర్స్ లోకి రానుంది.
ఈ సందర్భంగా ఇవాళ (ఆగస్టు 19న) ‘థామ’ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ‘ఒక ప్రేమకథ ఇంతకు ముందు చూసిన దానికంటే క్రూరంగా, ప్రాణాంతకంగా ఉంటుంది’ అని మేకర్స్ పోస్ట్ చేయడంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.
ఈ బ్లడీ హారర్ లవ్ స్టోరీ.. రష్మిక ఫ్యాన్స్ను ఉర్రూతలూగించేలా ఉంది. ఇందులో రష్మిక యాక్షన్, గ్లామర్తో ఆకట్టుకుంది. అంతేకాకుండా లిప్ కిస్తో అదరగొట్టింది. “భయం ఎప్పుడూ ఇంత శక్తివంతంగా లేదు. ప్రేమ ఎప్పుడూ ఇంత రక్తసిక్తంగా లేదు! అనే క్యాప్షన్ సైతం సినిమాపై క్యూరియాసిటీ కలిగిస్తోంది.
మాడాక్ హారర్-కామెడీ యూనివర్స్ 2018లో బాక్సాఫీస్ సూపర్ హిట్ ఫిల్మ్ 'స్త్రీ'తో ప్రారంభమైంది. ఆ తర్వాత 2022లో భేడియా, 2024లో ముంజ్య, 2024లో స్త్రీ 2 వచ్చాయి. ఇపుడు థామ మూవీ. ఈ ఒక్క టీజర్ సినిమాపై భారీ అంచనాలే పెంచింది. రిలీజైన కొన్ని క్షణాల్లోనే నెటిజన్ల మనసును దోచేసింది. ఈ చిత్రంలో పరేష్ రావల్, నవాజుద్దీన్ సిద్ధిఖీ కీలక పాత్ర పోషిస్తున్నారు.
అయితే, మాడాక్ హారర్-కామెడీ యూనివర్స్లో వచ్చిన ‘స్త్రీ2’ ప్రపంచవ్యాప్తంగా రూ.884.45 కోట్ల వసూళ్లను సాధించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఏడవ అత్యధిక వసూళ్లు చేసిన బాలీవుడ్ చిత్రంగా నిలిచింది. ఇండియాలో రూ.562.24 కోట్ల నెట్ వసూళ్లను వసూలు కలెక్ట్ చేసింది. ఓవర్సీస్లో రూ.144 కోట్లు సంపాదించింది. మరి ఇప్పుడు మాడాక్ హారర్-కామెడీ యూనివర్స్లో నాల్గవ భాగంగా వస్తోన్న థామ ఎలాంటి అంచనాలు క్రియేట్ చేయనుందో అనే ఆసక్తి నెలకొంది.
రష్మిక మందన్న వరుస సినిమాలు:
రష్మిక మందన్న గత నాలుగేళ్లుగా బాక్సాఫీస్ దగ్గర వరుస బ్లాక్‌బస్టర్ హిట్స్ అందుకుంటుంది. యానిమల్, పుష్ప 2, ఛావా, కుబేర సినిమాలతో మంచి సక్సెస్ జోష్లో ఉంది. తెలుగులోనే కాదు ఇండియాలోనే ఏ హీరోయిన్కు సాధ్యం కాని రికార్డ్ కలెక్షన్స్ సాధించింది. ప్రస్తుతం రష్మిక చేతిలో 'ది గర్ల్‌ఫ్రెండ్', 'రెయిన్‌బో', ‘మైసా’ మరియు 'పుష్ప 3'తో పాటు విజయ్ దేవరకొండతో ఓ మూవీ ఇలా.. కొత్త సినిమాలు లైన్లో ఉన్నాయి.
— Rashmika Mandanna (@iamRashmika) June 27, 2025