ఆర్మీ సైనికుడిని కొట్టిన టోల్ ప్లాజా సిబ్బంది : రూ.20 లక్షల జరిమానా విధించిన NHAI..

ఆర్మీ సైనికుడిని కొట్టిన టోల్ ప్లాజా సిబ్బంది : రూ.20 లక్షల జరిమానా విధించిన NHAI..

ఒక సైనికుడిని టోల్ సిబ్బంది కొట్టడంతో టోల్ ప్లాజాపై రూ. 20 లక్షల జరిమానా విధించారు. ఉత్తర్ ప్రదేశ్ మీరట్‌లోని భూని టోల్ ప్లాజాలో ఒక ఆర్మీ ఉద్యోగిని టోల్ సిబ్బంది కొట్టినందుకు టోల్ చార్జీలు వసూలు చేసే సంస్థపై నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) రూ. 20 లక్షల జరిమానా విధించింది.

అంతేకాకూండా భవిష్యత్తులో ఇక టోల్ ప్లాజా బిడ్లలో పాల్గొనకుండా సంస్థను నిషేధించింది.  17 ఆగస్టు  2025న మీరట్-కర్నాల్ హైవేలోని భూని టోల్ ప్లాజా వద్ద ఈ ఘటన జరిగింది. కపిల్ అనే సైనికుడు సెలవు తర్వాత తిరిగి విధులకు వెళుతుండగా టోల్ సిబ్బందితో జరిగిన మాటల వాగ్వాదం ఈ గొడవకు దారితీసింది.

ఈ సంఘటనపై స్థానిక పోలీసులు FIR బుక్ చేసి ఆరుగురిని అరెస్టు చేశారు. టోల్ సిబ్బంది ఇలా ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ప్రయాణికులకు సురక్షితమైన ప్రయాణాన్ని అందించడానికి కట్టుబడి ఉన్నామని NHAI తెలిపింది.

పరిస్థితిని చక్కదిద్దడం, సిబ్బంది క్రమశిక్షణ పాటించడంలో  ఏజెన్సీ నిర్లక్ష్యం కారణంగా  కాంట్రాక్ట్ ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు టోల్ ఏజెన్సీ మెస్సర్స్ ధరమ్ సింగ్‌పై NHAI ఈ రూ. 20 లక్షల జరిమానా విధించింది. 

టోల్ ప్లాజా సిబ్బంది ఇలాంటి ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నామని, జాతీయ హైవేలపై  సురక్షితమైన, సుఖమైన ప్రయాణాన్ని అందించడంలో కట్టుబడి ఉన్నామని NHAI గుర్తు చేసింది,