సడెన్ ట్విస్ట్: ఆగస్ట్ 22న డైరెక్టర్ మారుతి మూవీ రావాలి.. ఇంతలోనే కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్..

సడెన్ ట్విస్ట్: ఆగస్ట్ 22న డైరెక్టర్ మారుతి మూవీ రావాలి.. ఇంతలోనే కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్..

సత్యరాజ్‌‌, వశిష్ట ఎన్‌‌ సింహ, ఉదయభాను లీడ్ రోల్స్‌‌లో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించాడు. స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదెల నిర్మించిన ‘త్రిబాణధారి బార్బరిక్’చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో లేటెస్ట్గా సినిమా రిలీజ్కు సంబంధించి కొత్త అప్డేట్ ఇచ్చారు మేకర్స్. 

ఆగస్టు 22న విడుదల కావాల్సిన త్రిబాణధారి బార్బరిక్ మూవీ, ఇప్పుడు ఆగస్ట్ 29కి వాయిదా వేశారు మేకర్స్. ఈ క్రమంలో సినిమా అనుకున్న దానికంటే ఒక వారం లేట్గా వస్తుంది. అయితే, ప్రస్తుత కాలంలో మూవీ తెరకెక్కించడం కంటే సరైన రిలీజ్ టైం, కావాల్సినన్ని థియేటర్లను బ్లాక్ చేసుకుని విడుదల చేయడమే, గొప్ప విషయమనే సినీ క్రిటిక్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

ఇప్పటికే టీజర్‌‌‌‌తో ఆసక్తి రేపిన మేకర్స్.. ఇటీవలే ట్రైలర్‌‌‌‌ను విడుదల చేశారు. ‘‘ఈ యుద్ధం నీది.. ధర్మధ్వజం రెపరెపలాడాలంటే.. అధర్మం చేసేవారికి దండన లభించాలి.. అంటూ శ్రీకృష్ణుడు బార్బరికుడికి ధర్మోపదేశం చేస్తున్న సీన్‌‌తో ట్రైలర్ మొదలై ఆసక్తి పెంచింది. ఆ తర్వాత టైటిల్ రోల్ పోషిస్తున్న సత్యరాజ్‌‌ తన మనవరాలిని ఎంత గారాబంగా పెంచుతున్నది చూపించారు.

ఓరోజు ఆ అమ్మాయి మిస్‌‌ అవడంతో పోలీస్‌‌ కంప్లైంట్‌‌తో పాటు పేపర్‌‌‌‌లో యాడ్ ఇస్తారు. మరోవైపు వశిష్ట, ఇంకోవైపు ఉదయభాను పాత్రలను పరిచయం చేశారు. ఫైనల్‌‌గా తన మనవరాలిని కాపాడుకోవడానికి సత్యరాజ్ ఏం చేశాడు అనేది మూవీ మెయిన్ కాన్సెప్ట్‌‌ అని ట్రైలర్‌‌ ద్వారా అర్థమవుతోంది.

అంతేకాకూండా.. మిస్సింగ్, మర్డర్, డ్రగ్స్ కేసు చుట్టూ ఈ ‘బార్బరిక్’ కథ తిరుగుతున్నట్టుగా అనిపిస్తోంది. ఇందులో సాంచి రాయ్, సత్యం రాజేష్,  క్రాంతి కిరణ్, వీటీవీ గణేష్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇన్‌‌ఫ్యూజ‌‌న్ బ్యాండ్ సంగీతాన్ని అందిస్తోంది.