టీడీపీ.. జనసేన పొత్తు ప్రజలు కుదిర్చిన పొత్తు

టీడీపీ.. జనసేన పొత్తు ప్రజలు కుదిర్చిన పొత్తు

తాడేపల్లిగూడెంలో టీడీపీ.. జనసేన తొలి ఎన్నికల సభ జరిగింది. ఈసభలో చంద్రబాబు మాట్లాడుతూ వైసీపీ దొంగలపై పోరాడుతన్నామని  అన్నారు.  తాడేపల్లి గూడెం సభ రాష్ట్ర దశ‌‌–దిశ మారుస్తుందనన్నారు.  తాడేపల్లి సభ చూస్తే... తాడేపల్లి ప్యాలెస్​ కంపించబోతుంది.వచ్చే ఎన్నికలు రాష్ట్రానికి ఎంతో కీలకం...  రాష్ట్ర భవిష్యత్​ కోసం  టీడీపీ... జనసేన కలిశాయన్నారు.  రాష్ట్రాన్ని విధ్వంసం చేసే పాలకులను తరిమిగొడతామన్నారు.   విధ్వంసం అయిన రాష్ట్రాన్ని కాపాడటానికే నేను.. పవన్​ కళ్యాణ్​ కలిశామన్నారు. ఈ రెండు పార్టీల పొత్తు.. ప్రజలు కుదిర్చిన పొత్తు.. రాష్ట్రంలో వెలుగులు నింపే పొత్తు అన్నారు.  వచ్చే ఎన్నికల్లో మా సత్తా చూపిస్తామన్నారు.  భవిష్యత్తుకు నాంది పలకాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.   టీడీపీ హయాంలో కేంద్రం నుంచి పలు యూనివర్శిటీలు సాధించామన్నారు. టీడీపీ.. జనసేన మ్యానిఫెస్టో  త్వరలో విడుదలచేస్తామన్నారు. తెలుగుదేశం.. జనసేన ఐక్యత వర్దిల్లాలి అన్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో సైకో పాలన ఉందా లేదా అని ప్రశ్నించారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు.  ప్రజా వేదికను కూల్చి జగన్​ పాలన ప్రారంభించాడని విమర్శించారు.  హైదరాబాద్​ కంటే మెరుగైన రాజధాని కోసం అమరావతికి శ్రీకారం చుట్టామన్నారు.  టీడీపీ హయాంలో 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామని చంద్రబాబు అన్నారు.  రాష్ట్రాన్ని బాగు చేయాలనే సంకల్పంతో ముందుకెళ్లామన్నారు. టీడీపీ హయాంలో  16 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చామన్నారు. వైసీపీ పెత్తందారి వ్యవస్థకు నిదర్శనంగా మారిందన్నారు.  వైసీపీ ని చిత్తు చిత్తుగా ఓడించి.. రాష్ట్రాన్ని కాపాడటానికి  మీరు సిద్దమా తమ్ముళ్లు అని ప్రశ్నించారు. త్వరలో రాష్ట్రానికి నవోదయం వస్తుందన్నారు.  పోలవరాన్ని గోదావరిలో కలిపేశారన్నారు.

సీఎం జగన్​ రాష్ట్రాన్ని  కులాలు... ప్రాంతాల వారీగా విభజించారన్నారు.  తెలుగు జాతిని ప్రపంచంలోనే నెంబర్​ 1 గా చేయాలనే ఆలోచన నాకు, పవన్​ కళ్యాణ్​కు ఉందన్నారు. వైనాట్​ డీఎస్సీ.. వైనాట్​ ఇసుక... వైనాట్​ 175 కాదు.. వై నాట్​ పులి వెందుల అన్నారు.. హూ కిల్డ్​ బాబాయి.. జగన్​ సమాధానం చెప్పు. జగన్​ బ్లఫ్​ మాస్టర్​.. ఉన్నది లేనిది... లేనిది ఉన్నట్లు చెప్పే వ్యక్తి జగన్​ అని చంద్రబాబు అన్నారు. 

ALSO READ :- కారు లోయలో పడి ఆరుగురు దుర్మరణ

కుప్పంలో జగన్​ సినిమా సెట్టింగ్​ వేశారని చంద్రబాబు అన్నారు.  40 రోజుల తరువాత వైసీపీ రౌడీలకు రియల్​ సినిమా చూపిస్తామన్నారు. వైఎస్సార్​ కాంగ్రెస్​ ఛీటింగ్​ టీం అంటూ... టీడీపీ... జనసేన టీం విన్నింగ్​ టీం అని తాడేపల్లి గూడెం సభలో అన్నారు.