ముంబై దాడుల్లో పాక్ ఆర్మీకి నేను అత్యంత నమ్మకమైన ఏజెంట్: ఒప్పుకున్న తహవ్వూర్ రాణా

ముంబై దాడుల్లో పాక్ ఆర్మీకి నేను అత్యంత నమ్మకమైన ఏజెంట్: ఒప్పుకున్న తహవ్వూర్ రాణా

Tahawwur Rana: తహవ్వూర్ రాణా కొన్ని వారాల కిందట అమెరికా నుంచి భారత ప్రభుత్వం నిందితుడు. 2008లో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో వరుస దాడుల్లో కీలక సూత్రధారిగా పరిగణలో ఉన్న నిందితుడు. ప్రస్తుతం ఎన్ఐఏ కస్టడీలో జరుగుతున్న దర్యాప్తులో రాణా 26/11 ముంబై టెర్రర్ దాడులో తన పాత్ర గురించి షాకింగ్ విషయాలను బయటపెట్టాడు. 

తాను పాక్ ఆర్మీకి అత్యంత నమ్మకమైన ఏజెంట్ గా పనిచేసినట్లు రాణా చెప్పటం దర్యాప్తు అధికారులను కూడా షాక్ కి గురిచేసింది. ముంబైలో 2008లో జరిగిన దాడుల సమయంలో తాను పాక్ ఆర్మీకి ఎలా సహాయం చేశాననే విషయాలను కూడా ముంబై క్రైమ్ అధికారులకు రాణా వెల్లడించాడు. 64 ఏళ్ల రాణా దాదాపు 17 ఏళ్ల తర్వాత ముంబై అలాగే తాజా హోటల్ దాడుల కేసులో ప్రస్తుతం దర్యాప్తును ఎదుర్కొంటున్నాడు. 

2008 ముంబై ఉగ్రదాడుల్లో ఏకంగా 166 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ దాడుల కోసం తాను ముంబైలోని అనేక ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించినట్లు చెప్పాడు. లష్కర్ ఉగ్రవాదులు తాజ్ హోటల్ పై దాడి చేస్తున్నప్పుడు తాను ఆ ప్రాంతంలో ఉన్నట్లు వెల్లడించాడు రాణా. గల్ఫ్ యుద్ధం సమయంలో తనను సౌదీ అరేబియాకు పంపారని, తద్వారా లష్కర్ పెద్ద నెట్వర్క్ గా ఏర్పడిందనే సంకేతాలను ఇచ్చినట్లు ఒప్పుకున్నాడు. అలాగే డేవిడ్ హెడ్లీ ఉగ్రవాదులకు ట్రైనింగ్ సెషన్స్ కూడా నిర్వహించినట్లు దర్యాప్తు అధికారులతో చెప్పాడు. 

ALSO READ : గోల్డ్ స్టాక్ కనకవర్షం.. రెండు రోజుల్లో 36 శాతం అప్, మీ దగ్గర ఉంటే అమ్మెుద్దు..!

లష్కర్ ఉగ్రసంస్థ చీఫ్ హఫీజ్ సయద్ తరఫున రాణాతో పాటు అతని మిత్రుడు డేవిడ్ హెడ్లీ ముంబై దాడులకు రెక్కీ నిర్వహించటం నుంచి అన్ని రకాల సహాయాలు అందేలా దాడికి సహకరించినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. ఈ క్రమంలో రాణా ప్లాన్ చేయటంతో పాటు డేవిడ్ వీసా ప్రాసెసింగ్, తప్పుడు పత్రాల సృష్టిలో భాగస్వామిగా అధికారులు తేల్చారు. దీంతో రాణాపై నేరపూరిత కుట్ర, భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం, హత్య, ఫోర్జరీ, చట్టవిరుద్ధ కార్యకలాపాల చట్టాల కింద అభియోగాలు మోపబడ్డాయి.