ఉర్దూ అకాడమీ చైర్మన్​గా తాహెర్

ఉర్దూ అకాడమీ చైర్మన్​గా తాహెర్

హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్​గా నిజామాబాద్​కు చెందిన తాహెర్ బిన్ హుందాన్ నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి ఉమర్ జలీల్ ఉత్తర్వులు జారీ చేశారు. తాహెర్ బిన్ హుందాన్  ప్రస్తుతం పీసీసీ ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నారు.

2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఉమ్మడి రాష్ట్రంలో కొన్ని రోజులపాటు నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్​గా పనిచేశారు. ఇదిలా ఉండగా.. మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా ఒబైదుల్లా కొత్వాల్​ను ప్రభుత్వం నియమించింది.