
గజ్వేల్ ఆర్డీవో, తోగుట తహసీల్దార్ల కు మరోసారి శిక్ష విధించింది హై కోర్టు. మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు నష్ట పరిహారం చెల్లించాలంటూ గతంలో హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఐతే ఇప్పటివరకూ పరిహారం అందకపోవడంతో భూ నిర్వాసితులు మరోసారి హై కోర్టును ఆశ్రయించారు. ఐతే కేసు విచారించిన న్యాయస్థానం గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటించనందుకు…..సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఆర్డీవో విజేందర్ రెడ్డి, కొండపాక తహాసీల్దార్ ప్రభులకి 2 నెలల జైలు శిక్షతో పాటు… 2 వేల జరిమానా కూడా విధించింది.