తైపీ ఓపెన్ సూపర్ -300..సెమీఫైనల్లోకి ఆయుష్, ఉన్నతి

తైపీ ఓపెన్ సూపర్ -300..సెమీఫైనల్లోకి ఆయుష్, ఉన్నతి

తైపీ: ఇండియా యంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షట్లర్లు ఆయుష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షెట్టి, ఉన్నతి హుడా.. తైపీ ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–300 టోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. శుక్రవారం జరిగిన మెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫైనల్లో ఆయుష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 16–21, 21–19, 21–14తో ఏడోసీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్రియాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (కెనడా)పై సంచలన విజయం సాధించాడు. గంటా 11 నిమిషాల మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పేలవమైన ఆరంభంతో ఆయుష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాస్త ఇబ్బందిపడ్డాడు. ఈ క్రమంలో ప్రత్యర్థి కొట్టిన స్మాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను తీయలేక తొలి గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చేజార్చుకున్నాడు. కానీ రెండో గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆటతో ఆకట్టుకున్నాడు. బలమైన స్మాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, సుదీర్ఘమైన ర్యాలీలతో వరుసగా పాయింట్లు సాధించాడు. 

అవతలివైపు బ్రియాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా పట్టువదలకుండా పోరాడినా చివర్లో ఆయుష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెండు నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్రాప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సాధించాడు. డిసైడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇద్దరు హోరాహోరీగా తలపడినా ఎండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు మారిన తర్వాత ఆయుష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నతి 21–8, 19–21, 21–19తో హుంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యి టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (చైనీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తైపీ)ను ఓడించింది. 52 నిమిషాల మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నతికి గట్టి పోటీ ఎదురైనా కీలక టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వరుస పాయింట్లతో గట్టెక్కింది.