
మూడేళ్ల క్రితం వచ్చిన ‘కాంతార’కు ప్రీక్వెల్‌గా రాబోతోన్న చిత్రం ‘కాంతార చాప్టర్1’. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది. అక్టోబర్ 2న సినిమా విడుదల కానుంది. ఆదివారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
అతిథిగా హాజరైన ఎన్టీఆర్ మాట్లాడుతూ ‘చిన్నప్పుడు మా అమ్మమ్మ చెప్పిన కథలు నిజమేనా కాదా అనిపించేవి. ఆ కథలను ఇప్పుడు తెరపై చూడటం మాటలు రాలేదు. రిషబ్ శెట్టి నటుడు, దర్శకుడే కాదు..24 క్రాఫ్ట్ లను డామినేట్ చేయగలరు. అందుకే ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు.
ఇలాంటి సినిమాను రూపొందించడం అంత తేలికైన పనికాదు. రిషబ్ ఎంత కష్టపడ్డాడో కళ్లారా చూశా. ఇండియన్ సినిమా హిస్టరీలో బ్లాక్ బస్టర్ మూవీ కావాలని కోరుకుంటున్నా’ అని చెప్పాడు. రిషబ్ శెట్టి మాట్లాడుతూ ‘ఎన్టీఆర్ చేసిన సపోర్ట్ మర్చిపోలేనిది. ఈ చిత్రం ఆడియెన్స్ కు మంచి థియేట్రికల్ ఎక్స్ పీరియెన్స్ ఇస్తుంది’ అని అన్నాడు.
ఈ చిత్రం తనకు చాలా స్పెషల్ అని రుక్మిణీ వసంత్ చెప్పింది. నిర్మాత రవి శకంర్, మైత్రీ డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు. కాస్ట్యూమ్ డిజైనర్ ప్రగతి శెట్టి, హోంబలే ఫిల్మ్స్ కో ఫౌండర్ చలువే గౌడ పాల్గొన్నారు.