ఇకపై FDC పొర్టల్ ద్వారా సినిమా టికెట్లు

ఇకపై FDC పొర్టల్ ద్వారా సినిమా  టికెట్లు

ఇకపై ఫిల్మ్ డెవ్ లప్ మెంట్ కార్పోరేషన్ పోర్టల్  ద్వారా  సినిమా టికెట్లు అమ్మాలని ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ప్రైవేట్ బుక్ మై షో లుకూడా ఈ కొత్త విధానం  ద్వారానే టికెట్స్ బుక్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ విధానాన్ని త్వరలోనే అమలు చేస్తున్నట్లు చెప్పారు.  సినిమా టికెట్లను బ్లాక్ లో అమ్మడం వల్ల పబ్లిక్ ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.  సినిమా హాళ్లలో కూల్ డ్రింక్స్, ఇతర ఆహార పదార్థాలు ఎక్కువ ధరకు అమ్మితే కేసులు పెడతామని చెప్పారు.