ముంబైకి బుమ్రా టెన్షన్.. బీసీసీఐ సీఓఈలో స్టార్ పేసర్!

ముంబైకి బుమ్రా టెన్షన్.. బీసీసీఐ సీఓఈలో స్టార్ పేసర్!

బెంగళూరు: ఐపీఎల్19వ  సీజన్ ప్రారంభానికి ముందు ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను టెన్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టే విషయం బయటకు వచ్చింది. ఆ టీమ్ స్టార్ పేసర్ జస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రీత్ బుమ్రా ఇప్పటికీ ముంబై క్యాంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేరలేదు. ప్రస్తుతం తను బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) లో ఉన్నట్లు సమాచారం. ఈ ఫెసిలిటీలోని డాక్టర్లను బుమ్రా కలిసినట్లు తెలుస్తోంది. 

ఇటీవల టీ20 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా విజేతగా నిలవడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. ఫైనల్లో 4 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలిచాడు.  వరల్డ్ కప్ ఆడిన హార్దిక్, సూర్యకుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, తిలక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తదితరులు ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్రా రెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకున్న తర్వాత జట్టుతో చేరినా.. బుమ్రా మాత్రం నేరుగా ముంబైకి వెళ్లకుండా సీఓఈకి వెళ్లడం చర్చనీయాంశమైంది.  

తనకు ఏదైనా గాయమైందా? లేదా సాధారణ ఫిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెస్ పరీక్షల కోసమే వెళ్లాడా? అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. మెగా లీగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ముంబై తన తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఈ నెల29న వాంఖడే స్టేడియంలో కేకేఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఆడాల్సి ఉంది. ఆ టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు బుమ్రా అందుబాటులోకి వస్తాడా లేదా అన్నది ఇప్పుడు సస్పెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారింది.