ఆఫ్ఘనిస్తాన్ ప్రముఖ మతగురువు, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రిలీజియస్ స్కాలర్స్ మాజీ అధిపతి మౌల్వీ మొహమ్మద్ సర్దార్ జాద్రాన్‌ను తాలిబన్లు అరెస్టు చేశారు. సోమవారం ఈ విషయాన్ని కన్ఫాం చేశారు. ఆఫ్ఘన్‌లో ప్రభావవంతమైన మతగురువుగా మొహమ్మద్ సర్దార్ కు పేరు ఉంది. అరెస్టయిన మౌల్వీ మొహమ్మద్ సర్దార్ జద్రాన్ ఫొటోను తాలిబన్లు విడుదల చేశారు. ఆ ఫొటోలో మౌల్వీ కళ్లకు గంతలుకట్టి ఉన్నాయి.
