45 ఏళ్ల వ్యక్తి .. ఆరేళ్ల అమ్మాయి.. బాల్యవివాహాన్ని ఆపిన తాలిబన్లు.. ఇది మామూలు ట్విస్ట్ కాదు !

45 ఏళ్ల వ్యక్తి .. ఆరేళ్ల అమ్మాయి.. బాల్యవివాహాన్ని ఆపిన తాలిబన్లు.. ఇది మామూలు ట్విస్ట్ కాదు !

ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ రాజ్యం నడుస్తున్న విషయం తెలిసిందే. అత్యంత కరుడుగట్టిన ఉగ్రవాదులైన తాలిబన్లు.. ప్రభుత్వంపై యుద్ధం చేసి పాలన తమ చేతుల్లోకి తీసుకుని నాలుగేండ్లు పూర్తవుతోంది. 2021లో ఏర్పడిన తాలిబన్ ప్రభుత్వంలో ఎన్నో అరాచకాలు.. నిషేధాలు.. సమాజాన్ని తిరోగామి దిశగా.. అంటే ఆధునిక సమాజాన్ని మళ్లీ మధ్యయుగాలకు.. మత, మౌఢ్య, అంధ విశ్వాల వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. అలాంటి తాలిబన్లు ఒక బాల్యవివాహాన్ని ఆపటం ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. కానీ అందులో ట్విస్ట్ చూసి షాక్ అవ్వాల్సి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే amu.tv కథనం ప్రకారం.. ఆఫ్ఘనిస్తాన్ దక్షిణ ప్రాంతంలో ఒక ఆరేళ్ల చిన్నారిని బాల్య వివాహం చేసుకునేందుకు బలవంతంగా 45 ఏళ్ల వ్యక్తి ప్రయత్నిస్తున్నాడు. మార్జా జిల్లాలో అప్పటికే ఇద్దరు భార్యలున్న వ్యక్తి ఈ ఆరేళ్ల చిన్నారి కుటుంబ సభ్యులకు డబ్బు చెల్లించి పెళ్లి చేసుకుని తన ఇంటికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఈ న్యూస్ తెలుసుకున్న తాలిబన్లు.. ఆరేళ్ల చిన్నారిని పెళ్లి చేసుకోవడం తప్పు అని ఆదర్శాలు మాట్లాడి.. ఆపేశారు. 

అయితే అమ్మాయిని తొమ్మిదేళ్ల తర్వాత కాపురానికి తీసుకెళ్లవచ్చునని చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. వాళ్ల కంటికి ఆరేళ్ల అమ్మాయి మేజర్ కాలేదని కనిపించింది కానీ.. 9 ఏళ్లు నిండితే మాత్రం మేజర్ అయినట్లు కనిపించిదేమో. తాలిబన్ల నిర్ణయం చూసి ప్రపంచం అంతా ఆశ్చర్యానికి గురైంది.

►ALSO READ | బ్రెజిల్‌పై డొనాల్డ్ ట్రంప్ 50% సుంకం.. ఆగస్టు 1 నుంచి అమలులోకి..

ప్రపంచ దేశాలలో ఎక్కడైనా వివాహ వయసు అటూ ఇటుగా దాదాపు 18 ఏళ్లకుపైనే ఉంది. కానీ కొన్ని దేశాలలో ఇంకా బాల్య వివాహాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఆఫ్ఘనిస్తాన్ లో బాల్యవివాహాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నట్లు చర్యలు తీసుకున్న తాలిబన్లు.. ఆరేళ్ల పాపను తొమ్మిదేళ్లకు కాపురానికి తీసుకెళ్లవచ్చునని చెప్పడం గమనార్హం. అయితే 9 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకోవడం తప్పు కాదన్నట్లుగా అనధికారిక ఉత్తర్వులు ఇచ్చినట్లైందని విశ్లేషకులు అంటున్నారు. 

గతంలో తాలిబన్లు అధికారం చేపట్టక ముందు ఆఫ్ఘనిస్తాన్ లో అధికారికంగా యువతి పెళ్లి వయసు.. 16 ఏళ్లుగా ఉండేది. కానీ తాలిబన్లను వచ్చాక విచ్చలవిడిగా బాల్యవివాహాలు కొనసాగుతున్నాయి. మహిళలపై వేధింపులు, అణచివేత, చదువు నిరాకరించడం  మొదలైన నిబంధనలు కొనసాగుతున్నాయి. అమ్మాయిలకు చదువు నిషేదించిన తర్వాత బాల్య వివాహాలు 25 శాతం పెరిగిపోయినట్లు ఓ నివేధిక ద్వారా తెలుస్తోంది.