అప్ఘనిస్తాన్‌ను వశం చేసుకున్న తాలిబన్ల తలతిక్క నిర్ణయాలతో ప్రజలు విసుగుచెందుతున్నారు. ప్రధానంగా మహిళలపై పెడుతున్న ఆంక్షలు అన్నీ ఇన్నీ కావు. బయటకు రావొద్దని.. ఒకవేళ వస్తే.. ఇంటి వాళ్లతో రావాలని.. విద్యకు దూరంగా ఉండాలని ఎన్నో కఠిన నిబంధనలు పెట్టేస్తున్నారు. తాజాగా మరో నిర్ణయం తీసుకుంది తాలిబన్ సర్కార్. టీవీ ప్రజెంటర్లకు ఓ నిబంధన పెట్టింది. ముఖం కనిపించకుండా మొత్తం కప్పుకుని వార్తలు చదవాలని కొత్త కండీషన్ పెట్టడంతో అందరూ ఆశ్చర్యపోయారు. యాంకర్లే కాకుండా టీవీ ప్రజెంటర్లు, కవరేజ్ కు వెళ్లే మహిళా రిపోర్టర్లు ముఖం కూడా కనిపించకుండా తమ పని చేసుకోవాలంటూ హుకుం జారీ చేసింది.
తమ ఆదేశాలు పాటించేందుకు మే 21వ తేదీ వరకు గడువు విధించడం జరిగిందని తాలిబన్ మినిస్టర్ అఖిప్ మహజర్ వెల్లడించారు. ఒకవేళ పాటించని వారిపై ఎదురయ్యే పరిణామాల గురించి తాము ఇప్పుడే వ్యాఖ్యానించబోమని హెచ్చరించడంతో వార్తా సంస్థల్లో పని చేసే మహిళలు భయపడిపోతున్నారు. గతంలో తాలిబన్ల పాలనలో ఎన్నో అరాచకాలను ఎదుర్కొన్న మహిళలు ఇప్పుడదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. బహిరంగ ప్రదేశాల్లో తిరిగేటప్పుడు ముఖాన్ని కప్పేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. హిజాబ్ లో కాకున్నా ఇంట్లోని దుప్పట్లు కప్పేసుకుని ఆఫీసులకు రావాలని ఆదేశించారు. ఇలాంటి తలతిక్క నిర్ణయాలపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుుతున్నాయి.
మరిన్ని వార్తల కోసం : -
ట్విట్టర్ లోకి ట్రంప్.. ఆ వెంటనే షాక్
గుడ్ న్యూస్: తగ్గనున్న వంటనూనెల ధరలు
