ఓయూ బీ హాస్టల్​ను పీవీ మెమోరియల్ గా మార్చాలె : తల్లమల్ల శ్వేత హసేన్

ఓయూ బీ హాస్టల్​ను పీవీ మెమోరియల్ గా మార్చాలె : తల్లమల్ల శ్వేత హసేన్

హైదరాబాద్,వెలుగు :  ఓయూ పూర్వ విద్యార్థి, మాజీ ప్రధాని  పీవీ నరసింహారావు పేరిట ఓయూలోని బీ హాస్టల్ ను మెమోరియల్ గా మార్చాలని ఓయూ జేఏసీ కన్వీనర్ తల్లమల్ల శ్వేత హసేన్ ప్రభుత్వాన్ని కోరారు. క్యాంపస్ లో మూతపడిన బీ హాస్టల్ (కృష్ణవేణి హాస్టల్​) కు మరమ్మతులు చేయించి పీవీ  మ్యూజియంగా, రీసెర్చ్ సెంటర్ మార్చాలని విజ్ఞప్తి చేశారు. 106 ఏండ్ల  ఓయూలో సుమారు కోటి  మంది స్టూడెంట్లు చదవగా

 వారిలో పీవీ ప్రధాని అయ్యారని పేర్కొన్నారు. తాజాగా పీవీకి కేంద్రం భారతరత్న ప్రకటించిందని తెలిపారు.  ఉమ్మడి ఏపీకి సీఎంగా, కేంద్రమంత్రిగా, దేశప్రధానిగా, ఏఐసీసీ ప్రెసిడెంట్​గా వివిధ హోదాల్లో పనిచేసి దేశప్రజలకు సేవలు అందించారని పేర్కొన్నారు.  త్వరలోనే ఓయూ వీసీతో పాటు, పీవీ కుటుంబ సభ్యులను కలిసి మ్యూజియం ఏర్పాటుపై చర్చించనున్నట్టు ఆమె చెప్పారు.