
ప్రస్తుతం టాలీవుడ్ లో ఫుల్ స్వింగ్ లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది తమన్(Thaman) అనే చెప్పాలి. స్టార్ హీరో గానీ.. స్టార్ డైరెక్టర్ గానీ ఉన్నాడంటే.. ఆ సినిమాలో తమన్ ఉండాల్సిందే. ప్రస్తుతం మనోడి చేతిలో అరడజనుకు పైగా సినిమాలున్నాయి. అందులో పవన్ కళ్యాణ్(Pawan kalyan), మహేష్ బాబు(Mahesh babu),రామ్ చరణ్(Ram charan), అల్లు అర్జున్(Allu arjun),రవితేజ(Raviteja), రామ్(Ram) వంటి స్టార్ హీరోలు ఉన్నారు.
అయితే ఈ స్టార్ హీరోల అభిమానులు ఇప్పుడు ఫుల్ టెన్షన్ పడుతున్నారట. ఎందుకంటే.. తాజాగా తమన్ మ్యూజిక్ అందించిన బ్రో(Bro) సినిమా నుండి "మై డియర్ మార్కండేయ(My dear markandeya)" అనే మొదటి సాంగ్ రిలీజ్ అయ్యింది. ఈ సాంగ్ కు ఆడియన్స్ నుండి మిక్సుడ్ రియాక్షన్ వచ్చింది. దీనిపై సోషల్ మీడియాలో చర్చ కూడా మొదలైంది. ఎన్ని అంచనాలు పెట్టుకున్న మొదటి సాంగ్ ఇలా ఇచ్చావ్ ఏంటి తమనన్నా అంటూ డైరెక్ట్ తమన్ ను టాగ్ చేస్తూ కెమెంట్స్ పెడుతున్నారు.
పవన్ కళ్యాణ్ సినిమాకె ఇలా ఉందంటే.. ఆ తరువాత రానున్న మహేష్ బాబు గుంటూరు కారం(Guntur kaaram), రామ్ చరణ్ గేమ్ ఛేంజర్(Game changer), రామ్ స్కంద(Skanda) సినిమాల పరిస్థితి ఏంటి అంటూ ఆయా హీరోల ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడుతున్నారు. అసలే ఈ సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. అయితే ఆ అంచనాలను అందుకునేలా చేసేది పాటలే. అలాంటి పాటలే పేలవంగా ఉంటే సినిమాపై సరైన ఇంపాక్ట్ ఉండదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక బ్రో సాంగ్ రిలీజ్ తో మిగతా స్టార్ హీరోల ఫ్యాన్స్ కు కొత్త టెన్షన్ పట్టుకుంది. మరి అభిమానులు ఎదురుచూస్తున్న రేంజ్ లో తమన్ మ్యూజిక్ ఇస్తాడా? లేకా ఇలాగే డైజపాయింట్ చేస్తాడా అనేది చూడాలి.