త్వరలోనే తమన్నా పెళ్లి.. లవ్ గురించి చెప్పేసింది

త్వరలోనే తమన్నా పెళ్లి.. లవ్ గురించి చెప్పేసింది

తన రిలేషన్‌షిప్‌ స్టేటస్ పై ఎట్టకేలకు నోరు విప్పింది మిల్కీ బ్యూటీ తమన్నా(Thamannah). యాక్టర్ విజయ్ వర్మ(Vijay Varma)తో తమన్నా డేటింగ్ లో ఉందంటూ వస్తున్న వార్తలు నిజమేనని ఒప్పేసుకుంది. తాజాగా ఈ జంట కలిసి నటించిన మూవీ "లస్ట్ స్టోరీస్ 2(Lust Stories 2)". విజయ్ వర్మ, తమన్నా కలిసి నటించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో భాగంగా మూవీ ప్రమోషన్స్ కోసం రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు విజయ్ వర్మ, తమన్నా. లస్ట్ స్టోరీస్ 2 మూవీ షూటిగ్ టైంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని చెప్పుకొచ్చింది. 

"కేవలం సహనటుడు అనే కారణంగా విజయ్ వర్మను ఇష్టపడలేదు. నేను చాలా మందితో పనిచేశాను కానీ.. విజయ్‌ ప్రత్యేకమైన వ్యక్తి. నాకు  రక్షణగా నిలబడుతాడు అనే నమ్మకం ఉంది. మా ఇద్దరి మధ్య చాలా ఆర్గానిక్‌ బంధం ఉంది. నన్ను కిందకు లాగే వారి నుంచి రక్షిస్తాడు.  నా కోసం ఒక అందమైన ప్రపంచాన్ని సృష్టించుకున్నాను.  అనుకోకుండా ఆ ప్రపంచంలోకి నన్ను అర్థం చేసుకున్న విజయ్ వచ్చాడు. అతను నా పట్ల చాలా శ్రద్ధ వహిస్తాడు. తను ఉన్న ప్రదేశమే నాకు  సంతోషకరమైన ప్రదేశం" అని చెప్పుకొచ్చింది తమన్నా. ఇక తమన్నా చెప్పిన మాటలతో వీరిపై వస్తున్న రూమర్స్ కు చెక్ పడింది. ఇక త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధంగా ఉంది.