స్టాలిన్ మాతో టచ్ లో ఉన్నారు : BJP తమిళిసై

స్టాలిన్ మాతో టచ్ లో ఉన్నారు : BJP తమిళిసై

తమిళనాడు రాజకీయం హీటెక్కింది. పార్టీ నాయకుల మాటలు ఓటర్లను గందరగోళంలోకి నెడుతున్నాయి. తాము కాంగ్రెస్ ఆధ్వర్యంలోని కూటమికి గట్టి మద్దతుదారుగా ఉన్నామని డీఎంకే చీఫ్ స్టాలిన్ అంటున్నారు. కేసీఆర్ తో జరిగిన సమావేశంలోనూ ఇదే విషయాన్ని చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధానిగా ప్రపోజ్ చేసిందే తమ పార్టీ అని.. కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమిలోనే కొనసాగుతామని కేసీఆర్ కు చెప్పారు. టీఆర్ఎస్ కూడా యూపీఏలోకి రావాలని ఆయన కోరారు. ఐతే… తమిళనాడులోని బీజేపీ నేతల మాటలతో ఈ పొత్తు రాజకీయం తాజాగా మరో టర్న్ తీసుకుంది.

తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలు, ట్యూటికోరిన్ లోక్ సభ అభ్యర్థి తమిళిసై సౌందరరాజన్ లేటెస్ట్ గా ఓ హాట్ కామెంట్ చేశారు. పొత్తుకు సంబంధించి డీఎంకే పార్టీ… బీజేపీతో టచ్ లో ఉందంటూ వస్తున్న వార్తలు నిజమే అని చెప్పారు. డీఎంకే నేతలు కొందరు బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్నారని ఆమె అన్నారు. దేశంలో బీజేపీ గాలి వీస్తోందని… బీజేపీ గెలుపు ఖాయమని ఆమె అన్నారు.

కాంగ్రెస్ కూటమి గెలుపు ఖాయమని డీఎంకే అంటుంటే.. బీజేపీ నేతలు మాత్రం.. డీఎంకే తమవైపే ఉందని చెప్పడం.. హాట్ టాపిక్ గా మారింది.