34 మంది కేబినెట్ మంత్రుల జాబితాను విడుదల చేసిన ఎంకె స్టాలిన్

V6 Velugu Posted on May 06, 2021

తమిళనాడులో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. రేపు(శుక్రవారం,మే-7) డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందులో భాగంగా ఇవాల స్టాలిన్ మంత్రివర్గాన్ని రూపొందించారు. తనతో కలిపి 34 మంది మంత్రుల జాబితాను స్టాలిన్ రాష్ట్ర గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ కు పంపించారు. గవర్నర్ ఈ జాబితాను లాంఛనంగా ఆమోదించారు. 

స్టాలిన్ కుమారుడు ఉదయనిధికి కూడా మంత్రివర్గంలో స్థానం లభించనుందని గత కొన్నిరోజులుగా తమిళనాడు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే.. స్టాలిన్ గవర్నర్ కు పంపిన లిస్టులోజాబితాలో ఉదయనిధి పేరు లేదు. అంతేకాదు..స్టాలిన్ సాధారణ పరిపాలన సహా పలు శాఖలను తన దగ్గరే  ఉంచుకుంటున్నట్టు తెలుస్తోంది.

Tagged Tamil Nadu, MK Stalin, 34 cabinet ministers, releases list 

Latest Videos

Subscribe Now

More News